బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 31న రాష్ట్రానికి జేపీ నడ్డా రానున్నారు. ఈ సందర్భంగా ఆయన సంగారెడ్డిలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలో బీజేపీ కార్యాలయంను ప్రారంభించనున్న జేపీ నడ్డా.. అదే రోజు మరో 6 జిల్లా కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో మరో రెండు జిల్లాల కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించనున్నారు. అనంతరం సంగారెడ్డిలో ఏర్పాటు చేయనున్న సభలో జేపీ నడ్డా ప్రసంగించనున్నారు. అయితే.. తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ అధిష్టాటం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేసేందుకు వ్యూహాలు పన్నుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ నేతలు తెలంగాణ వరుసగా పర్యటిస్తున్నారు. అయితే.. జేపీనడ్డా పర్యటనలో భాగంగా ఆయన తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఆరా తీయనున్నారు జేపీ నడ్డా. వచ్చే ఎన్నికల్లో పాటించాల్సిన వ్యూహాలపై తెలంగాణ కాషాయనాథులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read : Kunamneni Sambasiva Rao : నయా హిట్లర్‌లాగా నరేంద్రమోడీ
ఇదిలా ఉంటే.. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీకి నిరసనగా ‘‘మా నౌకరీలు మాగ్గావాలే’’ నినాదంతో బీజేపీ తలపెట్టిన ‘‘నిరుద్యోగుల మహాధర్నా’’కు ఉన్నత న్యాయ స్థానం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో ‘‘నిరుద్యోగ మహాధర్నా’’ పేరిట దీక్ష చేపట్టనున్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఈ మహా ధర్నాలో పాల్గొని ప్రసంగిస్తారు.
Also Read : Train Stopped: దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైలును అడ్డుకున్న కాంగ్రెస్.. ఇది విప్లవానికి నాంది