బీజేపీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ ఫైల్స్ పేరుతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తప్పుడు ప్రచారం కాంగ్రెస్ నేతలు ఏడీజీకి వినతిపత్రం అందించారు. డీజీపీ అందుబాటులో లేకపోవడంతో ఏడీజీ సంజయ్ కుమార్ జైన్‌ను కలిసి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం ఇచ్చారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలకు రెడీ అయ్యాయి. దశల వారిగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. అయితే, అధికార బీజేపీ మాత్రం ఇంకా వేచి చూసే ధోరణి అవలంభిస్తోంది.
Election Heat in YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది.. టార్గెట్ 2024గా వివిధ క్యాంపైన్ల కోసం కసరత్తు షురూ చేసింది వైసీపీ.. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి జగనన్నే మన భవిష్యత్తు క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు.. క్యాంపైన్ ట్యాగ్ లైన్.. నువ్వే మా నమ్మకం జగన్ అని ఖరారు చేశారు. జగనన్నే మన భవిష్యత్తు అనే ప్రధాన క్యాంపైన్ కింద వచ్చే ఎన్నికల వరకు…
Pawan Kalyan Delhi Tour: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ బాట పట్టారు.. ఇప్పటికే హస్తిన చేరుకున్న ఆయన.. భారతీయ జనతా పార్టీలో కీలకంగా ఉన్న నేతలను కలవబోతున్నారు.. ప్రతిపక్షాలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఇటీవల ప్రకటించిన పవన్.. ఇప్పుడు అందుకే ఢిల్లీ వెళ్లారా? అనే చర్చ సాగుతోంది.. అయితే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ మధ్య హస్తిన వెళ్లివచ్చారు.. తన పర్యటనలో కేంద్ర…
ప్రధాని మోడీ డిగ్రీల వివరాలను అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు గుజరాత్ హైకోర్టు రూ. 25 వేల జరిమాన విధించింది. ఈ నేపథ్యంలోనే శివసేన నాయకుడు ఉద్దవ్ థాకరే ప్రధాని మోడీ డిగ్రీ వివాదంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
West Bengal: రామ నవమి నుంచి పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. రామ నవమి రోజున ప్రారంభం అయిన మతఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. రామ నవమి రోజున శోభాయాత్రపై ఓ వర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.
S Jaishankar:పాశ్యాత్య దేశాలకు మరోసారి తలంటారు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంలో, ఉక్రెయిన్ యుద్ధ విషయంలో వెస్ట్రన్ దేశాలు భారత వైఖరిని తప్పుబడుతున్న సమయంలో వారికి సరైన పాఠం నేర్పారు జైశంకర్. ఇదిలా ఉంటే మరోసారి పాశ్చాత్య దేశాల వైఖరిని తప్పుబట్టారు. రాహుల్ గాంధీ విషయంలో పలు విదేశాలు స్పందించడంపై ‘‘ బ్యాడ్ హ్యాబిట్’’ అంటూ ఘాటుగా స్పందించారు.