కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ ఎన్నికల ప్రచారంలో దిగబోతున్నారు. కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కిచ్చా సుదీప్ బీజేపీ తరుపున ప్రచారం చేయనున్నారు. తాను కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయనని, పార్టీ తరపున మాత్రమే ప్రచారం చేస్తానని సుదీప్ చెప్పారు.
పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అని మంత్రి హరీశ్ రావ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా రామయంపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం రామయంపేటలో KCR కాలనీ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్ రూంలను మంత్రి ప్రారంభించారు.
Kiccha Sudeep: కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రోజు బెంగళూర్ లోని ఓ ప్రైవేట్ హోటల్ లో సీఎం బసవరాజ్ బొమ్మై నేతృత్వంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీలో చేరుతారనే వార్తల నేపథ్యంలో ఆయనకు బెదిరింపు లేఖ వచ్చింది. దీనిపై కిచ్చా సుదీప్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
భాద్యతగల ఎంపీగా ఉండి బండిసంజయ్ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వక పోవడం నేరమే అని కీలక వ్యాఖ్యలు చేశారు నర్సం పేట శాసన సభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి. రాష్ట్రం లో పరీక్షల లీకేజీ వ్యవహారం లో బీజేపీ కుట్ర కోణం ఉందని మేము వ్యక్తం చేసిన అనుమానాలు నిజమయ్యాయని అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రికత్త నెలకొంది. సంజయ్ అరెస్ట్ను బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తు్న్నారు. సంజయ్ కుమార్ అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలకు బీజేపీ పిలుపునిచ్చింది.
10వ తరగతి పరీక్ష పేపర్ లీక్ కావడం రాజకీయంగా కూడా కలకలం రేపుతోంది. 10వ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. పోలీసులు మంగళవారం అర్థరాత్రి కరీంనగర్లోని ఆయన నివాసానికి వెళ్లి బండిని అదుపులోకి తీసుకున్నారు.
Kiccha Sudeep: వచ్చే నెలలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ముందు జరుగుతున్న కర్ణాటక ఎన్నికలను దేశం మొత్తం ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ ఎన్నికలను లోక్ సభ ఎన్నికల ముందు సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు. ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కన్నడ ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.