తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పదో తరగతి హిందీ పరీక్ష పేపర్ లీక్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై మంగళవారం అర్థరాత్రి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బండి సంజయ్ అరెస్ట్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ బీజేపీ నేతలతో తెలంగాణ బీజేపీ వ్యవహరాల ఇంచార్జీ తరుణ్ చుగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రేపు బీజేపీ సామూహిక ప్రతిజ్ఞలు చేయాలని, బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఎక్కడికక్కడ ప్రతిజ్ఞలు చేయాలని నిర్ణయించారు.
Also Read : Crude Oil Conspiracy: ‘క్రూడాయిల్’ వెనక కుట్ర!. ఉద్దేశపూర్వకంగానే ఉత్పత్తిని తగ్గిస్తున్నాయా?
కేసుకు, జైలుకు భయపడకుండా కార్యకర్తలు పనిచేసేలా వ్యూహం రచించడంతో పాటు కార్యకర్తలల్లో మనోధైర్యం నింపే విధంగా కార్యక్రమాలు చేయాలని తరుణ్ చుగ్ రాష్ట్ర నేతలకు ఆదేశించారు. ఇదిలా ఉంటే.. కొద్దిసేపటి క్రితం హన్మకొండ ప్రిన్సిపల్ మేజిస్ట్రేట్ అనిత రాపోల్ ఎదుట బండి సంజయ్‌ను పోలీసులు హాజరుపర్చారు. ఈ నేపథ్యంలో కోర్టు పరిసరాలతో పాటు బండి సంజయ్‌ను తీసుకెళ్తున్న రోడ్డులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో బండి సంజయ్‌ను పోలీసులు వెనుక గేటు నుంచి కోర్టులోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం కోర్టులో విచారణ కొనసాగుతోంది.
Also Read : Dharmavaram Erraguttta: ఎర్రగుట్టే హాట్ టాపిక్.. ఏమా కథాకమామీషు?