Harish Rao: పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అని మంత్రి హరీశ్ రావ్ మండిపడ్డారు. మెదక్ జిల్లా రామయంపేటలో మంత్రి హరీశ్ రావు పర్యటించారు. బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం రామయంపేటలో KCR కాలనీ పేరుతో నిర్మించిన డబుల్ బెడ్ రూంలను మంత్రి ప్రారంభించారు. టెన్త్ పేపర్ లీకేజీలపై బండి సంజయ్ అరెస్ట్ స్పందించిన మంత్రి హరీశ్ రావు సంజయ్ పై నిప్పులు చెరిగారు. బీజేపీ కుట్రలు నగ్నంగా నిన్న బయటపడ్డయని అన్నారు. KCR ని ఎదుర్కోలేక ఇలా బీజేపీ చేస్తుందని ఆరోపించారు. పట్టపగలు నగ్నంగా దొరికిన దొంగ బండి సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ కుట్రల్ని దేశం మొత్తం గమనిస్తుందని అన్నారు. నిన్న మధ్యాహ్నం పేపర్ లీక్ అయ్యిందని బీజేపీ వాళ్ళు ధర్నా చేశారని అన్నారు.
సాయంత్రం పేపర్ లీక్ లో అరెస్ట్ అయిన వాళ్ళని విడుదల చేయాలని ధర్నా చేశారని, పేపర్ లీక్ చేసింది బీజేపీ నాయకుడే అని మంత్రి మండిపడ్డారు. విద్యార్థి లోకం బీజేపీ కుట్రల్ని తిప్పి కొట్టాలని అన్నారు. ఎక్కడ కూడా ప్రశ్న పత్రం లీక్ కాలేదని ఇదంతా బీజేపీ ఆడుతున్న కుట్ర అని మంత్రి హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి చదువు విలువ తెలియదని మండిపడ్డారు. పేపర్ లీక్ వెనుక సూత్రధారి, పాత్రధారి బండి సంజయ్ అని నిప్పులు చెరిగారు. తాండూరు, వరంగల్ పేపర్ లీక్ వెనుక బండి సంజయ్ ఉన్నారని మంత్రి వ్యాఖ్యానించారు. జాతీయ నాయకులతో పేపర్ లీక్ సూత్రధారి దిగిన ఫోటోలు చూపించారు. రాష్ట్రంలో GHMC ఎన్నికలప్పుడు ఆత్మహత్య చేసుకున్నట్టు నాటకాలు ఆడారని తెలిపారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఓ కుట్ర చేశారని మండిపడ్డారు. ED, CBI పేరుతో వేధిస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 గంటల్లో బండి సంజయ్ కి ప్రశాంత్ 142 సార్లు ఫోన్ చేశారని మంత్రి వ్యాఖ్యానించారు.
మీకు పేపర్ లీక్ తో సంబంధం లేకుంటే మీరు ఎందుకు సమాచారం ఇవ్వలేదని మంత్రి ప్రశ్నించారు. ప్రశ్నా పత్రాలు పంపితే తప్పేంటి అని రఘునందన్ రావు చెబుతున్నారు.. నిస్సిగ్గుగా తప్పుడు చర్యలు సమర్దిస్తున్నారని మండపిడ్డారు మంత్రి. నడ్డా కూడా అబద్ధాలు చెబుతున్నారని, మీ కార్యకర్త కాకపోతే ఎందుకు అరెస్ట్ చేయాలని ధర్నా చేస్తున్నారని,TSPSC పేపర్ లీక్ వెనుక కూడా మీరే ఉన్నారని మంత్రి అన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని మంత్రి తెలిపారు. మీ డ్రామాలు KCR దగ్గర చెల్లవని, మతాన్ని రెచ్చగొట్టి లబ్ది పొందే పార్టీ బీజేపీ..నకిలీ యుద్ధాలు చేసే పార్టీ బీజేపీ..రోజు పేపర్ లీక్ అయితుందని ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని మంత్రి మండిపడ్డారు. యావత్తు తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని అసహించుకుంటుందని అన్నారు. చట్టము ఎవరికైనా ఒక్కటే..బండి సంజయ్ మీద అనర్హత వేటు వేయాలని, మీకు చీము నెత్తురు ఉంటే క్షమాపణ చెప్పాలని మంత్రి హరీశ్ రావ్ మండిపడ్డారు.
Rajinikanth: ‘లియో’ బ్రేక్ లో రజినీతో లోకేష్ మీటింగ్… ఈ కాంబోని తట్టుకోవడం కష్టం