తెలంగాణలో వరుసగా ప్రశ్నాపత్రాల లీకులు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అయితే.. ఇటీవల ప్రారంభమైన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన తెలుగు, హిందీ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో నిన్న అర్థరాత్రి సమయంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే.. దీనిపై ఈ రోజు వరంగల్ సీపీ రంగనాథ్ మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి పరీక్షపత్రాల లీకేజీ కేసులో A1గా ఎంపీ బండి సంజయ్ ఉన్నారని, A2 గా ప్రశాంత్ ఉన్నాడన్నారు. A3 మహేష్, A5 శివ కుమార్‌లను రిమాండ్ చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా.. బురా ప్రశాంత్ అరెస్ట్ చేశామని, వైర్సల్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. బురా ప్రశాంత్.. బయటకు వచ్చిన పేపర్స్.. హైదరాబాద్ లోని మీడియా హెడ్ కి పంపినాడు.. బండి సంజయ్ కి పెట్టాడు.. కుట్ర కేసు పెడుతారా అంటే పెట్టాము.. మహేష్. కూడా చాలా మందికి పంపినాడు.. ఈటల రాజేందర్ కూడా పంపినా.. వారిని ముద్దాయిగా పెట్టడం లేదు.. మొన్న 3న బండి సంజయ్‌కి మళ్ళీ చాటింగ్ జరిగింది. ప్రశాంత్ ఏది అయితే అది బండి సంజయ్ మధ్య చాటింది జరిగాయి.. కాల్ డేటా తిశాము.. బండి సంజయ్ ఫోన్ లేదు అని చెప్పారు. బండి సంజయ్ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకుంటాము. ఆ ఫోన్ లో మరింత సమాచారం ఉంటుంది. కమలాపూర్ నుండి ఎందుకు బయటకు వస్తుంది. దీని వెనుక ఉన్నది ఏంటి.. ఇది అంత గేమ్ ప్లాన్ తో జరుగుతుంది. పేపర్ బయటకు వస్తాయి కానీ అక్కడికి అక్కడే ఉండే ఛాన్స్ ఉంటుంది.. కానీ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం చేసే కుట్ర ఉంది. వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేశారు అంటున్నారు. ముందస్తు అరెస్టు చేశారు అక్కడ పోలీసు కస్టడీ నుండి వారిని అరెస్టు చేశాము.
Also Read : Family Doctor Programme: దేశానికే రోల్ మోడల్ గా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం
వారెంట్ లేకుండా సెక్షన్ 41సీఆర్పీ ప్రొసీజర్ ప్రకారం అరెస్టు చేశాము. బండి సంజయ్ అరెస్టు సంబంధించి లోకసభ స్పీకర్ కి సమాచారం ఇచ్చాము.. ఏ పార్టీ అని చూడలేదు. కానీ ఇక్కడ పరీక్షల పేపర్లలు లీకేజీ అవుతుంది అని ప్రచారం చేసే ఉద్దేశం పరీక్షలను రద్దు చేసేలా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంకి తల్లిదండ్రులు భయం కలిగించేలా చేసేలా కుట్ర చేశారు అనే విచారణ తేలుతుంది. కుట్రతోనే ఇరికిస్తే ఒక్క బండి సంజయ్ పైనా ఎందుకు కేసు పెట్టాము.. కుట్ర అయితే చాలా మంది బీజేపీ వాళ్లకు పేపర్ వెళ్ళింది వాళ్ళ ఆయన కేసులు పెట్టడం లేదు.. బయటకు వచ్చిన పేపర్ ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు బండి సంజయ్ ప్రశాంత్ ని వినియోగిస్తున్నారు అనేది విచారణ వస్తుంది. బండి సంజయ్ ని పోలీసు కస్టడీ కూడా తీసుకొనే ఆలోచన ఉంది. బండి సంజయ్ ఫోన్ కాల్ వివరాలు. తీసుకోవాలి చాట్స్ తీసుకోవాలి..’ అని సీపీ రంగనాథ్ మీడియాకు వెల్లడించారు.
Also Read : Super hero: సంకెళ్లతో ఆరు గంటలు ఈత.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన స్విమ్మర్