జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మాదిగ ఐక్యవేదిక విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ను జైలుకు పంపుతా అన్న బండి సంజయ్ ఆయనే జైల్లోకి పోయి కూర్చున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు యొక్క విధి విధానాలు చూస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. 8 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రశాంతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ పోతేమతాల పేరిట రెచ్చగొట్టి చిచ్చు పెడుతున్నారని, అమాయకులైన ప్రజలకు కూడా ద్రోహం చేయడానికి వెనుకాడడం లేదు ఈ బీజేపీ ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు.
Also Read : KKR vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకున్న ఆర్సీబీ
ఈరోజు పేపర్ లీకేజ్ బీజేపీ కుట్ర కేంద్రం నుంచి ఆదేశాలు అందుకొని ఇక్కడి నాయకులు ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కుట్ర జరుగుతోందన్నారు. పదో తరగతి పేపర్ లీకేజీ చూసిన తర్వాత ఇది ఉద్దేశపూర్వకంగా నరేంద్ర మోడీ నుంచి జేపీ నడ్డా ఆదేశాల మేరకే ఈ యొక్క కుట్ర చేశారన్నారు. క్షణాల మీద బయటకు తెచ్చి వాట్సాప్ లో పంపించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన అన్నారు. వాళ్ళ అధికార దాహం కోసం చదువు కునే పిల్లల జీవితాలతో ఆడుకున్నటువంటి నాయకుడు బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్ అంటూ ఆయన ధ్వజమెత్తారు. రెండు సంవత్సరాల నుండి ప్రజలను రెచ్చగొడుతూ ప్రజలకు అబద్ధాలు చెబుతూ మతవిద్వేషాలను రెచ్చగొడుతున్న నాయకుడు బండి సంజయ్ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటువంటి వ్యక్తిని వెంటనే పార్లమెంట్ నుండి బర్తరఫ్ చేయాలని రాష్ట్రమంతా డిమాండ్ చేస్తుందని ఆయన అన్నారు.
Also Read : Free Insurance: దేశవ్యాప్తంగా 28.78 కోట్ల మందికి.. ఏపీలో 79 లక్షల మందికి ఉచిత బీమా..