గురువారం జమ్మూకశ్మీర్లోని పూంచ్లో ఐదుగురు సైనికులను చంపిన ఉగ్రదాడి 2024 లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర కావచ్చునని ఆర్జేడీ ఎమ్మెల్యే భాయ్ వీరేంద్ర పేర్కొన్నారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అభ్యర్థులు పోటాపోటిగా ప్రచారం చేస్తున్నారు. ఇక, ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నామినేషన్ను ఈసీ ఆమోదించింది.
సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని బీఆర్ఎస్ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీలో ఉన్నోళ్లకు గులాంగిరి చేస్తారని, బీజేపీ వాళ్లు గుజరాత్ పెద్దలకు గులాంగిరి చేస్తారని.. కానీ బీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ ప్రజలకు గులాం గిరి చేస్తారని మంత్రి అన్నారు.
కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాక బీజేపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కొత్త వారికి బీజేపీ అవకావశం కల్పించింది. కొంత మంది సీనియర్లను పక్కన పెట్టింది. బీజేపీ అగ్రనాయకత్వం టికెట్ కేటాయించనందుకు మాసీ సీఎం జగదీశ్ షెట్టర్ సహా పలువురు నాయకులు బీజేపీని వీడారు. వారిలో కొందరు పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ప్రత్యర్థి పార్టీలలో చేరారు.
Somu Veerraju: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడుపై ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.. రాజమండ్రిలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి లేవని ప్రజలు చెప్పాలంటూ అచ్చెన్నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.. మాతో ఎవరు కలిసి ఉన్నారో లేదో మేమే చెప్పాలి అన్నారు… అసలు, బీజేపీతో టీడీపీ కలుస్తుందంటే అచ్చెన్నాయుడు ఏం చెబుతారు? అంటూ ప్రశ్నించారు. ఇక, రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ పటిష్టత…
Tulasi Ramachandra Prabhu: ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచుతుంది.. మొన్నటి మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి.. బీజేపీ తీర్థం పుచ్చుకోగా.. ఇక మరిన్ని చేరికలు ఉంటాయని.. మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు, పారిశ్రామికవేత్తలు పార్టీలోకి వస్తారంటూ ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నమాట.. ఈ నేపథ్యంలో.. ఈ రోజు బీజేపీలో చేరనున్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త తులసీ రామచంద్ర ప్రభు.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ ఏపీ కోర్ కమిటీ సమావేశం జరగనుంది..…
Bandi Sanjay: చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. మొయినాబాద్ సమీపంలోని అజీజ్ నగర్ లో ఈ భేటీ జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 23న తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. చేవెళ్లలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ నియోజకవర్గ నేతలతో సమావేశమై సభ ఏర్పాట్లపై చర్చించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుల ఈటెల రాజేందర్ తో పాటు మాజీ…