రాష్ట్రంలో అమిత్ షా టూర్ సక్సెస్ అయిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి తరుణు చుగ్ అన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని వేల మంది బీజేపీ కార్యకర్తల్లో, రాష్ట్ర ప్రజల్లో బాగా జోష్ వచ్చిందని ఆయన అన్నారు.
యువకుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు. లీకేజీలతో నిరుద్యోగుల జీవితాలను అంధకారంలో నెట్టారని విమర్శించారు. చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడిన అమిత్ షా.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్ర ఆరోపనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. మాజీ గవర్నర్ ఆరోపణలను గోయల్ ఖండించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణల పర్వం తీవ్రమైంది. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఉన్న అధికారం నిలుపుకునేందుకు అధికార బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది.
ప్రధాని నరేంద్రమోడీని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందా? కేరళ బీజేపీకి వచ్చిన ఓ లేఖ ఇప్పుడు కలకలం రేపుతోంది. కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీపై దాడి జరుగుతుందని హెచ్చరిస్తూ కేరళ బీజేపీ చీఫ్ కే సురేంద్రన్కు బెదిరింపు లేఖ వచ్చింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీకి రెబల్స్ బెడద పట్టుకుంది. పార్టీకి చెందిన కీలక నేతలు బీజేపీని వీడడంతో ఎన్నికల పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ 50 మందికిపైగా కొత్త వారికి అవకాశం కల్పించింది. అదే సమయంలో సీనియర్ నాయకులను పక్కన పెట్టింది.
Vishnu Kumar Raju: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా పర్యటన నేపథ్యంలో యర్రగొండపాలెంలోని మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ శ్రేణులు, టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో వైసీపీ కార్యకర్తలు ఇద్దరికి, చంద్రబాబుకు సెక్యూరిటీ అధికారికి గాయాలైనట్టు చెబుతున్నారు.. ఇక, మంత్రి ఆదిమూలపు సురేష్.. తన టీ షర్ట్ విప్పిన విషయం విదితమే.. అయితే.. దీనిపై స్పందించిన బీజేపీ సీనియర్…