Bandi Sanjay : పాలమూరు ‘‘నిరుద్యోగ మార్చ్’’కు తరలిరండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు కోసం బీజేపీ పోరు.. సీఎం స్పందించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కేటీఆర్ ను బర్తరఫ్ చేసేవరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా పోరాడతామన్నారు. అయితే.. ఇవాళ ఆయన.. -ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పోలింగ్ బూత్ అధ్యక్షులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో రేపు (ఈనెల 25న) జరగబోయే ‘‘నిరుద్యోగ మార్చ్‘‘ కు పెద్ద ఎత్తున తరలిరావాలని కార్యకర్తలకు, యువతకు పిలుపునిచ్చారు. 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తుకు సంబందించి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సీఎం స్పందించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.
Also Read : Anchor Suma: అందరు చూస్తుండగానే సుమ గొంతు పట్టుకొని వార్నింగ్ ఇచ్చిన హీరో గోపీచంద్..
Also Read
- The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో 'నాని' విజ్ఞప్తి.!
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
కేసీఆర్ ప్రభుత్వం గత 8 ఏళ్లుగా నిరుద్యోగుల గొంతు కోస్తోంది. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని భర్తీ చేస్తానని గతంలో చెప్పిన సీఎం కేసీఆర్ ఆ తరువాత మాట మార్చి అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. కానీ నేటికీ ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా కాలయాపన చేస్తోంది. 21 నోటిఫికేషన్లు విడుదల చేసినా ఏ ఒక్కటీ సక్రమంగా నిర్వహించలేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ పేరుతో నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకుంటోంది. కేసీఆర్ కుటుంబమే ఈ లీకేజీపై ఆరోపణలు వస్తున్నా కేసీఆర్ మాత్రం ఇంతవరకు స్పందించకపోవడం సిగ్గు చేటు. పేపర్ లీకేజీకి ఐటీశాఖ నిర్లక్ష్యమే కారణమైనప్పటికీ కేసీఆర్ కొడుకును బర్తరఫ్ చేయకపోగా, ఆయనను కాపాడుకోవడానికి సీఎం యత్నిస్తున్నారు.
Also Read : SRH vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తుంటే.. సిట్ పేరుతో దోషులను కాపాడే యత్నం చేస్తున్నారు. సిట్ చేసిన విచారణలేవీ ఇంతవరకు అతీగతీ లేదు. నయీం ఆస్తులు, డ్రగ్స్, మియాపూర్ భూముల కుంభకోణమే ఇందుకు కారణం.ఈ విషయాలన్నీ తాము ప్రస్తావిస్తుంటే ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు టెన్త్ పేపర్ లీక్ పేరుతో తనను అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయినప్పటికీ తాము భయపడలేదని, తనను ఎక్కడ అరెస్ట్ చేశారో అక్కడి నుండి నిరుద్యోగ మార్చ్ నిర్వహించి బీజేపీ సత్తా చూపారు. అందులో భాగంగానే పాలమూరులో రేపు నిర్వహించబోయే ‘‘నిరుద్యోగ మార్చ్’’ కు ప్రతి ఒక్కరూ తరలి రావడంతోపాటు పెద్ద ఎత్తున యువతను మార్చ్ లో భాగస్వామ్యం చేయాలి. 30 లక్షల మంది యువత భవిష్యత్తుతో ముడిపడిన సమస్యపై సీఎం స్పందించి టీఎస్సీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడంతోపాటు ఐటీశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా బీజేపీ పోరాడుతుంది. పాలమూరులో జరగబోయే ‘‘నిరుద్యోగ మార్చ్’’ కు తరలిరావాలంటూ మీడియా, సోషల్ మీడియా వేదికగా విస్త్రత ప్రచారం చేయాలన కోరుతున్నా.’ అని ఆయన బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!