Hima Varsha Reddy: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నకల్ లో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దినకర్మ నిర్వహించారు.. అయితే, నీరజారెడ్డి దినకర్మ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆమె కూతురు హిమ వర్షా రెడ్డి… అవకాశం కల్పిస్తే పత్తికొండ లేదా ఆలూరు నియోజకవర్గంలోగాని పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.. అమెరికాలో ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హిమవర్ష రెడ్డి.. ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు.. గతంలో హిమవర్ష తండ్రి దివంగత పాటిల్ శేషిరెడ్డి కూడా రాజకీయాల్లో ఉన్నారు.. ఎమ్మెల్యేగా సేవలు అందించారు.. 1996లో హత్యకు గురయ్యారు మాజీ ఎమ్మెల్యే పాటిల్ శేషిరెడ్డి.. ఇక, ఆ తర్వాత ఆయన భార్య నీరజారెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టారు.. 2009-2014లో ఆలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు.
Read Also: Shabbir Ali : హోంమంత్రి పదవికి అమిత్ షా అన్‌ఫిట్
అయితే, గత వారం జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు నీరజారెడ్డి.. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తుండగా బీచుపల్లి వద్ద టైర్ పేలడంతో ఆమె ప్రయాణించే కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఆమెను కర్నూలులోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇక, డ్రైవర్ బాబ్జీకి గాయాలయ్యాయి. నీరజారెడ్డి 2009-2014లో ఆలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు. బీజేపీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్‌గా కొనసాగుతోన్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.