Hima Varsha Reddy: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం తెర్నకల్ లో మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దినకర్మ నిర్వహించారు.. అయితే, నీరజారెడ్డి దినకర్మ రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు ఆమె కూతురు హిమ వర్షా రెడ్డి… అవకాశం కల్పిస్తే పత్తికొండ లేదా ఆలూరు నియోజకవర్గంలోగాని పోటీ చేయడానికి సిద్ధమని ప్రకటించారు.. అమెరికాలో ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న హిమవర్ష రెడ్డి.. ఇప్పుడు రాజకీయాలపై ఆసక్తిగా ఉన్నారు.. గతంలో హిమవర్ష తండ్రి దివంగత పాటిల్ శేషిరెడ్డి కూడా రాజకీయాల్లో…
ప్రశాంతంగా ఉన్న దేశంలో మతకల్లోలం సృష్టించడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన కామెంట్స్ వల్ల మతకల్లోలానికి దారి తీసే అవకాశం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు బాధను కలిగించాయన్నారు.
మధ్యప్రదేశ్‌లో వివాహ పథకం లబ్ధిదారుల జాబితాలో కొంతమంది మహిళల పేర్లు లేకపోవడంతో వారి గర్భ పరీక్షలు పాజిటివ్‌గా రావడంతో వివాదం చెలరేగింది. వివాహ పథకం కింద లబ్ధి పొందేందుకు మహిళల అర్హతను తనిఖీ చేసేందుకు వారికి గర్భ పరీక్షలను నిర్వహించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ అధికార బీజేపీ విరుచుకుపడ్డాయి.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బిజెపి), జనతాదళ్ (సెక్యులర్)తో సహా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని వేగవంతం చేయడం ప్రారంభించాయి. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదివారం బెంగళూరులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
రాష్ట్రానికి మోడీ చేసిన మోసాలు, బీజేపీ చేసిన అన్యాయాలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని మంత్రి కేటీఆర్ నేతలకు సూచించారు. బీఅర్ఎస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలతో కేటీఆర్ ఆదివారం టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ నెల 25న జరగబోయే ప్రతినిధుల సభలు.. వచ్చే ఎన్నికలకు బలమైన పునాదిరాళ్లు అంటూ నేతలకు సూచనలు చేశారు.
బిజెపి నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శక్తులను ఏకం చేసే పనిని స్వయంగా తీసుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం కోల్‌కతాలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నారు. మోడీ సర్కార్‌ను గద్దె దించడమే లక్ష్యంగా బిహార్ సీఎం నితీష్ వివిధ పార్టీల నేతలను కలుస్తున్నారు. ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలిశారు.
పూంచ్ ఉగ్రదాడి ఘటన రాజకీయ రంగు పులుముకుంటోంది. జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. పూంచ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నిందితులపై ఆపరేషన్ సమయంలో అమాయకులను వేధించవద్దని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా భద్రతా ఏజెన్సీలను కోరారు.