మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తికంగా మారాయి. ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ బీజేపీతో కలుస్తారన్న ప్రచారంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. తన మద్దతుదారులతో బీజేపీలో చేరేందుకు అజిత్ పవార్ చర్చలు జరుపుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
తమిళనాడులో మిత్రపక్షాలుగా ఉన్న విపక్ష అన్నాడీఎంకే, బీజేపీల మధ్య దూరం పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇరు పార్టీల నేతల మధ్య విభేదాలతో పొత్తుకు బీటలు వారినట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో పొరుగున ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జానీ నెల్లూరు బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశారు. కేరళ కాంగ్రెస్కు రాజీనామా చేసిన తర్వాత, జానీ నెల్లూరు జాతీయ సెక్యులర్ పార్టీని ఏర్పాటు చేస్తానని, అది భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో చేరుతుందని చెప్పారు.
పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్టీ అగ్రనేత ముకుల్ రాయ్ బిజెపిలో చేరాలని భావిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాలని ఆయన యోచిస్తున్నారు. బీజేపీలోకి తిరిగి రావడానికి ఆసక్తిగా ఉన్నందున కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవాలనుకుంటున్నట్లు చెప్పారు.