Revanth Reddy: తెలుగుదేశం పార్టీ హయాంలో ఓఆర్‌ఆర్ ప్రతిపాదన పెడితే.. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓఆర్‌ఆర్‌కు పునాది పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని 5 వేల ఎకరాల్లో ఏర్పాటు చేశారన్నారు. 158 కి.మీ ఓఆర్ ఆర్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఏర్పాట్లు చేశామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఓఆర్‌ఆర్ సౌకర్యాలు లేవని స్పష్టం చేశారు. పెట్టుబడులు, రవాణా సౌకర్యార్థం హైదరాబాద్‌లో ఓఆర్‌ఆర్ వేశామన్నారు. విదేశీ పెట్టుబడులకు ORR కీలకంగా మారింది. ఈగిల్ ఇన్ ఫ్రా సంస్థకు టోల్ వసూల్ కు ఇచ్చారని చెప్పారు. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్ లు దోచుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఓఆర్‌ఆర్‌ను కేవలం టోల్ వసూలు మాత్రమే కాకుండా దాని నిర్వహణను కూడా ప్రైవేట్ కంపెనీకి ఇవ్వాలని చూశారని పేర్కొన్నారు.
Read also: Errabelli Dayakar Rao: కేసీఆర్ నిర్ణయాన్ని రైతులకు తెలిసేలా ప్రచారం చేయండి
టీవీఓ పద్ధతిలో ఓ ప్రైవేట్ కంపెనీకి విక్రయించినట్లు వెల్లడైందని తెలిపారు. కేసీఆర్ 30 ఏళ్లుగా ఓఆర్‌ఆర్‌ను అమ్ముకున్నారని ఆరోపించారు. ప్రతి ఏడాది రూ.700-800 కోట్లు వస్తోందన్నారు. 30 ఏళ్లకు రూ.30 వేల కోట్లు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నా రూ.7,380 కోట్లకు అమ్మేశారు. ఆరు నెలల క్రితమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అయితే రానున్న ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తుందని చెప్పారు. సోమేశ్ కుమార్, అరవింద్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దీని వెనుక రూ.1000 కోట్లు చేతులు మారాయని, పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు. దీనిని కాంగ్రెస్ సహించబోదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు.
Srinivas Goud: వైన్స్ షాప్ ల్లో రిజర్వేషన్లు .. పదేళ్లలో ఎక్కడికో వెళ్ళిపోతాం