MP Laxman: మోడీ ముచ్చటగా మూడో సారి పీఎం అవుతారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కేంద్రం ప్రకటించిన రైల్వే ప్రాజెక్టులపై తండ్రి కొడుకుల స్పందన ఏది? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంగళవారం (ఆగస్టు 15) ఎర్రకోటలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరుకాలేదు. తన కళ్లలో ఏదో సమస్య కారణంగా హాజరు కాలేకపోయానని చెప్పారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది ఆయన నివాసం నుంచే జెండాను ఎగురవేస్తానని చెప్పారు.
స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. భారతదేశం "విశ్వగురువు"గా మారాలంటే ప్రజలు సామరస్యంగా జీవించాలని.. మంచి విద్య, వైద్య సదుపాయాలు మరియు నిరంతర విద్యుత్ సరఫరాకు హామీ ఇవ్వాలని ఆయన అన్నారు.
CM KCR: సమైక్య పాలనలో తెలంగాణలోని అన్నిరంగాలు విధ్వంసమైపోయాయని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య దినోత్సవ శుభాకాంక్షలు. బ్రిటిష్ బానిస బంధాలను ఛేదించి, దేశ విముక్తిని సాధించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులకు ఈ సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాను. గత ఏడాది భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఇప్పుడు వజ్రోత్సవాల సమాపన ఘట్టాన్ని కూడా అంతే ఘనంగా నిర్వహించు కుంటున్నాం. ఈ సందర్భంగా…
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఆమె కార్యకర్తలను ఉద్దేశించి స్వతంత్ర దినోత్సవం గురించి మాట్లాడారు. breaking news, latest news, telugu news, big news, daggubati purandeshwari, bjp,
దేశ విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి సోమవారం నివాళులు అర్పించారు. 1947 ఆగస్ట్ 14న విభజన సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తు చేసుకున్నారు.
కేసీఆర్ అవినీతి, అప్రజాస్వామిక, నిజాం నియంతృత్వ పాలనపై తెలంగాణ ఉద్యమం స్థాయిలో మరో పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తెలిపారు. కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా మూడో దశ పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రణ్ దీప్ సింగ్ సుర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు, ఆ పార్టీకి ఓట్లేసి, సపోర్ట్ చేసే వారంతా రాక్షసులే అని అన్నారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో సీఎం కేసీఆర్ వెంట నడిచిన నాయకులకు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్లు, బ్రిడ్జిల తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని మంత్రి చెప్పుకొచ్చాడు.