మణిపూర్లో జీ20 ఈవెంట్ను నిర్వహించకపోవడంపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం ప్రశ్నలు సంధించారు. జీ20 సమ్మిట్ను ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ.. మణిపూర్లో పరిస్థితి సాధారణ స్థితి నెలకొంటే జీ20 సదస్సును అక్కడ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీ వాళ్లకు బీ-ఫార్మ్ కావాలంటే ఢిల్లీకి పోవాలి.. ఢిల్లీ గులాంలకు.. తెలంగాణ ఆత్మ గౌరవం మధ్య ఎన్నికలు జరుగనున్నాయని కేటీఆర్ కామెంట్స్ చేశాడు. బీజేపీ మతం మంటలు పెడుతుంది.. కేసీఆర్ ను జైలుకు పంపుతానని విమర్శించిన వ్యక్తినే ఇప్పుడు షెడ్డుకు పోయిండు అంటూ కేటీఆర్ సెటైర్ వేశాడు.
రాష్ట్రంలో ఎవరెన్ని ట్రిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే అని మంత్రి హరీష్ రావు అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఎక్కువగా సీట్లు గెలుస్తాం.. కుర్చీ కోసం కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కొట్టుకుంటున్నాయి.. ప్రతి పక్షాలది తిట్లలో పోటీ.. బీఆర్ఎస్ కి దేశంలో తెలంగాణని నంబర్ వన్ స్థానంలో నిలపడంలో పోటీ.. ఈ నెల23న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించబోతున్నారు అని ఈ సందర్భంగా మంత్రి చెప్పుకొచ్చారు.
తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలు చెలిమెలో చాపలు పడుతున్నట్టు ఉంది. బీఆర్ఎస్ ను ఓడించాలని అంటే యువత ముఖ్యం.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గం యువతే.. యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. వాళ్ళే గేమ్ చేంజర్లు.. వాళ్ళు మా వైపు వస్తే కేసీఆర్ ను ఓడిస్తామని మురళిధర్ రావు తెలిపారు.
Minister KTR: హైదరాబాద్లో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ హైదరాబాద్లో ఇందిరాపార్క్-వీఎస్టీ స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కర్ణాటక ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ దేశంలో దూసుకెళ్తోంది. అధికార బీజేపీపై అవినీతి ఆరోపణలు చేస్తూ ప్రజలను తమవైపు తిప్పుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. మధ్యప్రదేశ్లో కూడా కర్ణాటక తరహాలోనే అదే ఫార్ములాను ఉపయోగించాలని ప్రయత్నిస్తోంది.
న్నికల పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయన్న ఆయన.. కొత్త ప్రభుత్వం జనసేన - బీజేపీ నా? లేక జనసేన - టీడీపీ - బీజేపీ ప్రభుత్వమా? ఏదైనా సరే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు.