పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై మంగళవారం కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, పలు ఇతర ప్రతిపక్షాలు కేంద్రంపై మండిపడ్డాయి.
తెలంగాణ అమరవీరులు, వారి త్యాగాలపై పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అగౌరవ వ్యాఖ్యలు రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని అవమానించడమే తప్ప మరొకటి కాదని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ మంగళవారం అన్నారు.
ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ ను తప్పుబడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. దీంతో రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. మీ స్క్రిప్ట్ రైటర్ ను మార్చుకోండి పప్పు జీ అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి నెట్టింట ఓ పోస్ట్ చేశాడు.
Sonia Gandhi: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురాబోతోంది. సోమవారం మోడీ అధ్యక్షతన మంత్రి మండలి ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో ఈ బిల్లును కేంద్రం తీసుకువస్తోంది. అయితే బిల్లును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ చెప్పింది.
Women's Reservation Bill: మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ నిన్న సంచలన నిర్ణయం తీసుకుంది. దశాబ్ధాలుగా ఉన్న మహిళా బిల్లుకు కీలక ముందడుగు పడింది. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించబడిన మహిళా బిల్లుకు కేంద్ర పచ్చజెండా ఊపింది. మరో నేటి నుంచి మరో నాలుగు రోజులు జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ బిల్లును తీసుకురాబోంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఏపీ విభజనపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. మోడీ ఎవరినీ విమర్శించలేదు.. విభజన టైంలో పార్లమెంట్లో చోటు చేసుకున్న అంశాల గురించే ప్రస్తావించారని క్లారిటీ ఇచ్చారు.
మెదక్ లో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు డాక్టర్ కేఏ పాల్ మీడియా సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు శాంతి కావాలంటే ప్రజాశాంతి పార్టీ రావాలి అని తెలిపారు.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గాడ్సే, సావర్కర్ల బిడ్డలను తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన విమర్శించారు.
ట్విట్టర్ వేదికగా విజయశాంతి ఓ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇయ్యలేదు, తెలంగాణ ప్రజలు ఉద్యమాలతో తెచ్చుకున్నారు అని మంత్రి హరీష్ రావు ఇప్పుడు అంటున్నారు అని ఆమె అన్నారు. తెలంగాణ ప్రజల ఉద్యమాల ఫలితంగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణ ఏర్పాటును సాధ్యం చేసినది నిజం.. అయితే.. బీఆర్ఎస్ చెప్పుకుంటున్నట్లు వారి ముఖ్యమంత్రి కేసీఆర్ చావు నోట్లో తల పెట్టి తెచ్చింది అబద్దం, హాస్యాస్పదం అని ఆమె అన్నారు.