Bandi Sanjay : ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముస్లిం వాషర్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ముస్లిం ధోబి ఘాట్లకు, లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత పథకాన్ని వర్తింప చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ నిర్ణయంతో తరతరాలుగా దోభి వృత్తిపై ఆధారపడి బతుకుతున్న రజకులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారని ఆయన మండిపడ్డారు. ఇక గల్లీ గల్లీలో వేరే వర్గానికి చెందిన వాళ్ళ లాండ్రీ షాపులు వెలుస్తాయని, ఓవైసీని సంతోష పెట్టడానికి రజకుల వృత్తిని నాశనం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. ఈ నయా నిజాంకు మత పిచ్చి ఎక్కువైందంటూ బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఒక మతం ఓట్ల కోసం కేసీఆర్ హిందూ సమాజంలో ఉన్న కులవృత్తులను అణిచివేస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ది మత దురహంకారమని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. బీసీల కుల వృత్తులను ఆర్థికంగా దెబ్బతీసి అయినా సరే ఎంఐఎంను సంతృప్తి పరచాలన్నది కేసీఆర్ లక్ష్యమని బండి సంజయ్ విమర్శించారు.
Also Read : Pigeon: పావురాలు ఈ కలర్ లో కూడా ఉంటాయా? చూస్తే షాక్ అవ్వాల్సిందే
Also Read
ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మైనార్టీ వర్గం ఓట్ల కోసం కేసీఆర్ బీసీ ల కులవృత్తులపై దాడి చేస్తారా అని ఆయన అన్నారు. ఇప్పటికే వేరే వాళ్లు దూరడంతో తమ కులవృత్తుల వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని బీసీ కులాల వాళ్ళు తీవ్ర మనో వేదనలో ఉన్నారని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మూలిగే నక్కపై తాటి పండు ఎత్తేసినట్టుగా ఉందని ఆయన అన్నారు. కులవృత్తులపై ఆధారపడ్డ బీసీలు, ఎస్సీలు కేసీఆర్ చేస్తున్న ద్రోహన్ని గమనిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న రజకులకు బిజెపి అండగా ఉంటుంది. సమిష్టిగా కేసీఆర్ మత దురహంకారం పై పోరాడుదాం. కులవృత్తులను కాపాడుకుందామన్నారు బండి సంజయ్
Also Read : Women Reservation Bill: “మీరు ఎంపీలను చంపడానికి ప్రయత్నించారు”.. సోనియాగాంధీపై బీజేపీ ఎంపీ ఆరోపణలు..
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!