Kishan Reddy : భారతదేశం ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా అవతరించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బషీరాబాగ్, కింగ్‌కోఠి లోని భారతీయ విద్యాభవన్, కులపతి మున్షీ సదన్” లో జరిగిన 9వ “రోజ్ గార్ మేళా” కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు కిషన్ రెడ్డి. AIIMS, SBI, BDL FCI, Mannu, హైదరాబాద్ యూనివర్సిటీ లతో కలిపి మొత్తం 12 శాఖల్లోని వివిధ విభాగాల్లో 238 మంది అభ్యర్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్‌మెంట్ లెటర్స్ అందించారు. నేడు జరిగిన 9వ రోజ్‌గార్ మేళాతో కలుపుకుని మొత్తం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 6లక్షలకు పైగా యువత ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు అపాయింట్‌మెంట్ లెటర్స్ పొందారు.
Also Read : rainy season food : వర్షాకాలంలో ఎలాంటి ఆహరం తీసుకోవాలి..?
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్‌గార్ మేళాలో భాగంగా ఇవాళ అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మీ తల్లిదండ్రులకు కూడా మన:పూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నానని, రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను నరేంద్ర మోదీ ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేస్తోందన్నారు. భారతదేశం ప్రపంచంలో ఐదో ఆర్థిక శక్తిగా అవతరించిందని, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ భారతదేశంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధికి దోహదపడుతోందన్నారు. దేశ వ్యాప్తంగా 11 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడిందని, కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగ అత్యంత ప్రమాదకరమైంది. అందుకే గ్రామీణ మహిళలకు ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన కింద కోట్లాది గ్యాస్ కనెక్షన్లు అందిస్తోందన్నారు కిషన్ రెడ్డి.
గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళల సమస్యలు పరిష్కరిస్తోందని, హర్ ఘర్ జల్ కింద దేశంలోని కోట్లాది ఇండ్లకు పైపులైన్ ద్వారా మంచినీటిని సరఫరా చేస్తోందన్నారు. గ్రామీణం నుంచి పట్టణాల వరకు దేశ వ్యాప్తంగా 12 లక్షల ఉద్యోగాలను వేగవంతంగా పూరిస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అని ఆయన అన్నారు.
అంతేకాకుండా.. ‘ ప్రజలందరికీ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 40 కోట్ల జన్ ధన్ అకౌంట్లు మహిళల పేరిట అందించాం. ఎలాంటి ష్యూరిటీ లేకుండా పేదలందరికీ బ్యాంకు ఖాతాలు ఇవ్వడం జరిగింది. దేశ వ్యాప్తంగా లక్షా 20 వేల కోట్లతో జాతీయ రహదారులను అద్భుతరీతిలో నిర్మించడం జరిగింది. ప్రపంచంలో అత్యధిక జాతీయ రహదారుల నెట్ వర్క్ ఉన్న దేశంగా భారత్ రెండో స్థానంలో ఉంది.
ప్రభుత్వ ఉద్యోగాలను ప్రోత్సహిస్తూ.. విజన్ తో దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నారు. ప్రతినెలా ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను పూర్తి చేసే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం 12 లక్షల ఉద్యోగాలు పూర్తయ్యే వరకు నిరంతరంగా కొనసాగుతుంది. దేశంలో ఇప్పటివరకు 6 లక్షల ఉద్యోగ అభ్యర్థులకు ప్రధాని నరేంద్ర మోదీ గారితో జాబ్ అపాయింట్ మెంట్ లెటర్స్ అందాయి. కానీ తెలంగాణ లో మాత్రం 17 సార్లు నోటిఫికేషన్ పరీక్షలు రాద్దయయి
సులభమైన, నిష్పాక్షిక మరియు పారదర్శక ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. ఆన్ లైన్ సిస్టమ్ ద్వారా ఖాళీలు మరియు నియామక ప్రక్రియపై నిరంతర పర్యవేక్షణ. రోజ్ గార్ మేళాతో దేశ ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో యువతను భాగస్వామ్యం చేస్తోంది.
చంద్రుడి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ల్యాండ్ చేసి జాబిల్లిపై భారత్ జెండా ఎగురవేసుకున్నాం. ఏ దేశానికి సాధ్యం కానిది భారత్ చేసి చూపింది. ప్రధాని మోదీ గారి నాయకత్వంలో భారత్ వేదికగా జరిగిన జీ-20 సదస్సుతో ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశనం చేయడం జరిగింది. భారత్‌లోని సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని చాటిచెప్పాం. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో చిక్కుకున్న 25,000 మంది భారతీయ విద్యార్థులను సురక్షితంగా వెనక్కి రప్పించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుంది. కరోనా ఆపత్కాలంలో ఎన్-95 మాస్కుల నుంచి మొదలు వెంటిలేటర్ల వరకు స్వయంగా భారత్ లో తయారు చేసుకున్నాం. సొంతంగా వ్యాక్సిన్ చేసుకుని దేశ ప్రజల ప్రాణాలు కాపడిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిది. దేశంలో పేదరికం నుంచి బయటపడి, అవినీతి, కుటుంబ రాజకీయాల నుంచి కాపాడటమే ఉద్దేశం. పుట్టిన నాటి నుంచి చేయూతనందిస్తూ ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను ప్రతి ఒక్కరు గౌరవించుకోవాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, జన్మించిన గ్రామాన్ని, భాషను ఎప్పటికీ మర్చిపోవద్దు. భారత్ లో ప్రతిరోజు మదర్స్ డే.. ప్రతి రోజు తల్లిదండ్రులను గౌరవించుకోవడమే. ఇదే మన భారతీయ గొప్ప సంస్కృతి.’ అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
-
South Africa: సౌతాఫ్రికాలో రెండు మినీ బస్సులు ఢీ.. 21 మంది మృతి
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!