ISKCON Biggest Cheat: ఇస్కాన్‌పై బీజేపీ ఎంపీ తీవ్ర ఆరోపణలు.. గోవులను కసాయిలకు విక్రయిస్తోంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISKCON Biggest Cheat: ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ మేనకా గాంధీ. ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసం.. ఆవుల షెడ్లను నడుపుతూ ప్రభుత్వం నుండి భారీగా భూములతో పాటు అనేక ప్రయోజనాలను పొందుతున్నారన్న ఆమె.. ఇస్కాన్‌లో పెద్ద ఎత్తున మోసం జరుగుతోందని విమర్శించారు. ఇక్కడ గోవులను గోశాల నుంచి బయటకు తీసి కసాయిలకు విక్రయిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు మేనకా గాంధీ. అయితే, బీజేపీ ఎంపీ వ్యాఖ్యలకు తీవ్రంగా ఖండించింది ఇస్కాన్.
కేంద్ర మాజీ మంత్రి అయిన మేనకా గాంధీ.. జంతు హక్కుల పరిరక్షణలో నిరంతరం చురుకుగా ఉన్నారు. ఇస్కాన్ దేశంలోనే అతిపెద్ద మోసం అని ఆమె ఆరోపించారు. ‘ఆవు షెడ్లను నడుపుతోంది మరియు భారీ భూములతో సహా ప్రభుత్వం నుండి అనేక ప్రయోజనాలను పొందుతుంది’ కానీ, మోసం చేస్తోందని ఆరోపించారు.. ఒక మీడియా కథనం ప్రకారం, బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్‌లోని ఆవు షెడ్ గురించి ప్రస్తావించారు. తాను ఇస్కాన్‌కు చెందిన అనంతపురం గోశాలకు వెళ్లానని, అక్కడ పాలు ఇవ్వని ఒక్క ఆవు కూడా కనిపించలేదు.. అలాగే డెయిరీ మొత్తంలో ఒక్క దూడ లేదు. పాడిపరిశ్రమలో పాలు ఇవ్వని ఒక్క ఆవులు లేవు.. ఒక్క దూడ కూడా లేదంటే అవి అన్నీ అమ్మేసినట్టే కదా? అన్నారు.
Also Read
- Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
ఇస్కాన్ తన ఆవులన్నింటినీ కసాయిలకు విక్రయిస్తోందని ఆరోపించారు మేనకా గాంధీ.. ఈ పనిని వాళ్లు చేసినంతగా ఎవరూ చేయరు అని మండిపడ్డారు.. వీధుల్లో ‘హరే రామ్ హరే కృష్ణ’ అని పాడతారు. దీని తరువాత వారి జీవితమంతా పాలపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. బహుశా వీరు అమ్మినన్ని ఆవులను కసాయిదారులకు మరెవరూ అమ్మి ఉండరని పేర్కొన్నారు. అయితే, మేనకా గాంధీకి సంబంధించిన ఈ ఇంటర్వ్యూ దాదాపు నెల రోజుల క్రితం అయినట్టు సమాచారం. ‘మదర్స్ మిల్క్’ పేరుతో డాక్యుమెంటరీ తీసిన డాక్టర్ హర్ష ఆత్మకూరి.. బీజేపీ ఎంపీ మేనకా గాంధీతో మాట్లాడినట్లు చెబుతున్నారు. ఇక, ఆవులను కసాయిదారులకు విక్రయిస్తున్నట్లు మేనకా గాంధీ చేసిన ఆరోపణలపై ఇస్కాన్ స్పందించింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో గోసంరక్షణలో ఇస్కాన్ అగ్రగామిగా ఉందని ప్రకటించింది ఇస్కాన్.
తాజావార్తలు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!