Mynampalli: మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి, ఆయన కుమారుడు రోహిత్ రెడ్డి న్యూఢిల్లీ వెళ్లారు. ఈ నెల 23న మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. మల్కాజిగిరి, మెదక్ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని మైనంపల్లి హన్మంతరావు బీఆర్‌ఎస్ నాయకత్వాన్ని కోరారు. అయితే బీఆర్‌ఎస్ నాయకత్వం మైనంపల్లి హన్మంతరావుకు మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే కేటాయించింది. మెదక్ టికెట్ విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు.. టీపీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమక్షంలో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
2009లో మెదక్ నుంచి టీడీపీ అభ్యర్థిగా మైనంపల్లి హన్మంతరావు గెలుపొందారు. మైనంపల్లి హన్మంతరావు 2014 ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2018 నుంచి మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2023లో మల్కాజిగిరి నుంచి మైనంపల్లి హన్మంతరావుకు టికెట్ వచ్చింది. అయితే ఆయన కుమారుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్‌ఎస్ రాలేదు. దీంతో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్‌లో చేరనున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా రెండు టిక్కెట్లు ఇచ్చేందుకు సుముఖంగా ఉంది. దీంతో మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
Puri Jagannadh: నీకన్నా తోపు ఎవడులేడిక్కడ…