ప్రధాని మోడీ ఓబీసీ కులంపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రం తోసిపుచ్చింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒడిషాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో ప్రధాని మోడీ ఓబీసీ కాదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
ఏపీ రాజకీయం ఢిల్లీకి మారింది. బీజేపీ పెద్దలతో రాష్ట్ర అధినేతల వరుస భేటీలు ఆసక్తిరేపుతున్నాయి. నిన్న కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు పొత్తులపై చర్చించారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నమే ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. కాగా.. చంద్రబాబు వెళ్లిన మరుసటి రోజే సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడం ఏపీ రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది. కాగా.. నిన్న బీజేపీ పెద్దలతో జరిగిన చంద్రబాబు భేటీలో జనసేన, బీజేపీతో…
ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. పొత్తుల విషయంలో జేపీ నడ్డా, అమిత్ షా, చంద్రబాబు మధ్య చర్యలు సానుకూలంగా జరిగినట్లు తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా బీజేపీకి 5 నుంచి 6 లోక్ సభ స్థానాలు, 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వనున్నట్లు సమాచారం. విజయవాడ, ఏలూరు, గుంటూరు, రాజమండ్రి, రాజంపేట, విశాఖ లోక్ సభ స్థానాలు బీజేపీకి కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
కేంద్రం తీరుకు నిరసనగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఢిల్లీ వేదికగా (Delhi) ఆందోళనకు దిగుతున్నాయి. జంతర్‌మంతర్ దగ్గర బుధవారం కాంగ్రెస్ ఆందోళన చేపట్టగా.. గురువారం కేరళ ప్రభుత్వం నిరసనకు దిగింది.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సమగ్ర కార్యాచరణ కోసం పార్టీ పెద్దలను కలిశామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపు బీజేపీ ఎన్నికల కమిటీ ఢిల్లీలో సమావేశం కానుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఉండనుందని, తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా ఉందన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తున్నారని, బీజేపీ గెలువద్దని కుమ్మక్కు అవుతున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. అంతేకాకుండా.. తెలంగాణలో…
Mood of the Nation 2024 survey: 2024 ఎన్నికలకు సమీపిస్తున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భావిస్తుండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ సారి ఎలాగైనా బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ‘మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 సర్వే’ వెలువడిండి. ప్రజల మూడ్ ఎలా ఉందనే దానిపై సర్వే జరిగింది.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై విపరీతమైన ప్రజా వ్యతిరేకత ఉందన్నారు సుజనా చౌదరి.. టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు రావడానికి చంద్రబాబే సమాధానం చెప్పాలని వ్యాఖ్యానించారు. పొడచూపిన విభేదాలను పరిష్కరించేందుకు ప్రయత్నాలు గతంలో జరిగాయి.. కానీ, ఫలించలేదన్న ఆయన.. స్వర్గీయ అరుణ్ జైట్లీ బతికి ఉన్నట్లయితే... ఏపీలో ఈ విభేదాలు, పరిస్థితులు ఇలా ఉండేవి కావన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధం అయ్యారు.. ఈ రోజు రాత్రికి ఢిల్లీ చేరుకోనున్న సీఎం జగన్.. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఇతర కేబినెట్ మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.