సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మెదక్ ఎంపీగా పోటీ చేయాలని ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. అయితే.. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్లే అభ్యర్థి అని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో టైం బాగా లేక ఓడిపోయా.. ఓడిపోయినా.. మా ప్రజలు రెస్ట్ ఇచ్చారని పేర్కొన్నారు. ఐదేళ్లు రెస్ట్ ఇచ్చారు.. కృతజ్ఞతలు అని అన్నారు. గాంధీ భవన్ లో పార్టీ కోసం పని చేస్తున్నానని తెలిపారు.
హైదరాబాద్ లోని యాకత్ పురా అసెంబ్లీ నియోజకవర్గంలో విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్రలో ఎంపీ డా. లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బీజేపీ విజయ సంకల్ప యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడన్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇంకా 6 గ్యారెంటీలు ఎలా నెరవేరుస్తారని ప్రశ్నించారు.…
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో మరో వివాదం చెలరేగింది. అసెంబ్లీలో పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం రాజకీయ దుమారం రేపింది. రాజ్యసభ ఎన్నికల ఫలితాల అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ ఆరోపణలపై ముఖ్యమంత్రి సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ నినాదాలు నిజమని ప్రతిపక్ష బీజేపీ నిరూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆరోపణలపై ఫోరెన్సిక్ సైన్య ల్యాబ్ విచారణకు సీఎం పిలుపునిచ్చారు.
Priyanka Gandhi: హిమాచల్ ప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాజ్యసభ ఎన్నికలకు అక్కడి అధికార కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టాయి. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి అనుకూలంగా ఒటేయడంతో ఆ రాష్ట్రంలోని ఒకే ఒక రాజ్య సభ సీటులో కమలం గెలిచింది. ఇదిలా ఉంటే, దీని తర్వాత రాష్ట్రంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం, కాంగ్రెస్ నేత సుఖ్వీందర్ సుఖు రాజీనామా చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే, వీటిని ఆయన కొట్టిపారేశారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం…
Chinese flag on Isro ad: తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఇస్రో ప్రకటన వివాదాస్పదంగా మారింది. తమిళనాడు రాష్ట్రంలోని కులశేఖర పట్నంలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఇస్రో స్పేస్‌పోర్టు గురించి డీఎంకే మంత్రి చేసిన ప్రకటనలో చైనా జెండా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాకెట్ పై భాగంలో చైనా జెండా కలిగి ఉండటంతో డీఎంకే అభాసుపాలవుతోంది. రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్ విడుదల చేసిన ప్రకటనలో.. ఇస్రో కులశేఖరపట్టణంలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయడాన్ని…
BJP Vijaya Sankalpa Yatra: రాముడే లేడని మాట్లాడిన కాంగ్రెస్ కావాలా? లేదా రాముడికి గుడి కట్టిన ప్రధాని నరేంద్ర మోడీ కావాలా? అని ప్రజలు ఆలోచించుకోవాలని బీజేపీ ఎంపీ డా లక్ష్మణ్ అన్నారు. హిందువుల కోసం అయోధ్య రామమందిర నిర్మాణాన్ని చేపట్టిన గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోడీ అని పేర్కొన్నారు. ట్రిపుల్ తలక్ రద్దు చేసి ముస్లిం మహిళలకి అన్నగా నిలిచిన వ్యక్తి మన మోడీ అని అన్నారు. పాత బస్తీ బాగుపడాలంటే బీజేపీని…
PM Modi : తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు వరుస ఎన్నికల పర్యటనలు సిద్దమవుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి కనీసం పది ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో.. కాంగ్రెస్, బీఆర్ఎస్లు ప్రచారాన్ని ప్రారంభించకముందే ముమ్మరంగా ప్రచారం చేపట్టాలని బీజేపీ భావిస్తోంది.
CPI Narayana Slams PM Modi Over Farmers Protest 2024: ప్రజా సమస్యలను వదిలేసి ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. రైతులు ఆందోళనలో ఉంటే జంతువులను వేటాడినట్లు వేటాడుతున్నారని, అన్నదాతలపై యుద్ధం సరికాదన్నారు. దేవుళ్లను కలిసే మోడీ.. సమస్యల్లో ఉన్న ప్రజలను ఎందుకు కలవరు? అని ప్రశ్నించారు. విగ్రహాలు తెచ్చానని గొప్పలు చెప్పుకునే మోడీ.. లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వాళ్లను ఎందుకు వెనక్కి…