Chandrababu and Pawan Kalyan: నేడు ఢిల్లీ బీజేపీ పెద్దల్ని కలవనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. సార్వత్రిక ఎన్నికలకు పొత్తులపై మంతనాలు జరుపనున్నారు. ఏపీలో పొత్లులపై బీజేపీ హైకమాండ్ ఎటూ తేల్చలేకపోతోంది. టీడీపీ-జనసేనతో పొత్తుపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. టీడీపీ, జనసేనలు తొలి జాబితాను ప్రకటించడమే కాకుండా ఉమ్మడి ఎజెండాతో జనంలోకి వెళ్తున్నాయి. ఎన్డీఏలో ఉన్న జనసేన మరోవైపు టీడీపీ సైతం కచ్చితంగా బీజేపీతో పొత్తు ఉంటుందని పదేపదే చెబుతున్నాయి. కానీ ఢిల్లీలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల అంశంపై ఎటువంటి క్లారిటీ రాలేదు.ఈ విషయంలో మరోసారి అగ్రనేతలతో పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సోమువీర్రాజులు సమావేశం కాబోతున్నారు. దీంతో చంద్రబాబు కూడా ఇవాళ ఢిల్లీ పెద్దలతో పొత్తులపై చర్చించనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది.
Read Also: Jasmin Tea : జాస్మిన్ టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలిస్తే రోజూ తాగుతారు..
నిన్న దాదపు గంటన్నరసేపు చంద్రబాబు – పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఢిల్లీ పరిణామాలతో పాటు.. రెండో విడత అభ్యర్థుల జాబితాపై కూటమి పార్టీల అధినేతలు కసరత్తు చేసినట్టు సమాచారం. వీలైనంత త్వరగా రెండో విడత జాబితాను విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఎన్డీఏలో టీడీపీ చేరికకు సంబంధించి చర్చించారు. అలాగే ఢిల్లీ పెద్దల వద్ద ప్రస్తావించాల్సి అంశాలపై నేతలు డిస్కస్ చేశారు. పొత్తు కుదిరితే ఎన్ని కేటాయించాలి వంటి అంశాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ హైకమాండ్ మాత్రం పొత్తుపై ఎటు తేల్చకుండా గందరగోళంలో పడేసింది. ఏపీ బీజేపీ నేతలు కూడా హైకమాండ్‌దే తుది నిర్ణయం అని ప్రకటించేసింది. నిన్న బీజేపీ కోర్ కమిటీ మీటింగ్‌లో పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని చెబుతున్నారు నేతలు. ఇవాళ జరిగే సమావేశంలోనైనా క్లారిటీ వస్తుందేమోనని చూస్తున్నారు.
Read Also: Postal Jobs 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోస్టల్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ..
మరోవైపు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పొత్తుల విషయంలో వెంటనే క్లారిటీ రావాలని ఆశిస్తున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఎన్నికల కసరత్తును వేగవంతం చేశారు. చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారం సైతం ప్రారంభించారు. ఇక బీజేపీతో పొత్తుపై క్లారిటీ వస్తే సీట్లు కేటాయించి సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. క్లారిటీ కోసం ఇవాళ బీజేపీ పెద్దల్ని కలిసేందుకు చంద్రబాబు కూడా హస్తినకు పయనమవుతున్నారు. దీంతో ఏపీ రాజకీయం ఢిల్లీకి షిఫ్ట్ అయింది.