Varun Gandhi: వరుణ్ గాంధీకి బీజేపీ షాక్ ఇచ్చింది. గత కొంత కాలంగా ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం నేపథ్యంలో.. తాజాగా ప్రకటించిన 5వ జాబితా అభ్యర్థుల్లో ఆయన పేరు లేదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ పిలిభిత్ నుంచి ఎంపీగా ఉన్న వరణ్ గాంధీ స్థానాన్ని కాంగ్రెస్ మాజీ నేత జితిన్ ప్రసాదకు కేటాయించింది. ఇదిలా ఉంటే, ఆయన తల్లి, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీని సుల్తాన్‌పూర్ నుంచి బరిలోకి దించింది. అయితే, బీజేపీ ఒక వేళ సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా నిలబడాలని వరుణ్ గాంధీ అనుకుంటున్నట్లు సమాచారం. గత కొంత కాలంగా ఆయన సొంత పార్టీపైనే విమర్శలు చేస్తుండటంపై బీజేపీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: BJP 5th List: బీజేపీ ఐదో జాబితా విడుదల.. తెలంగాణలో ఇద్దరు, ఏపీలో 6గురు అభ్యర్థులు ప్రకటన
ఇక రాబోతున్న లోక్‌సభ ఎన్ని్కల్లో పిలిభిత్ నుంచి బీజేపీ తరుపున పోటీ చేయబోతున్న జితిన్ ప్రసాద 2021లో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. సొంత ప్రాంతం లఖింపూర్ ఖేరిలో కాంగ్రెస్ నుంచి వచ్చిన ఒత్తిడితో ఆయన బీజేపీలో చేరారు. ఒకప్పుడు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహిత నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను విస్మరించడంతోనే బీజేపీలో చేరినట్లు ఆయన చెప్పారు.
2004లో జితిన్ ప్రసాద, రాహుల్ గాంధీతో కలిసి అమేథి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి, జితిన్ ప్రసాద షాజహాన్‌పూర్ నుంచి గెలుపొందారు. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో అతిచిన్న వయస్కుడైన మంత్రుల్లో ఒకరిగా నిలిచారు. 2009లో ధౌరారా స్థానం నుంచి రెండో సారి విజయం సాధించారు. 2017 యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో రాహుల్ గాంధీ చేతులు కలపడాన్ని జితిన్ ప్రసాద తీవ్రంగా ఖండించారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌తో విభేదాలు ప్రారంభయ్యాయి. దీంతో బీజేపీలోకి మారారు.