Wayanad BJP Candidate: బీజేపీ అధిష్ఠానం లోక్‌సభ అభ్యర్థుల ఐదో జాబితాను రిలీజ్ చేసింది. 111 మందితో విడుదల చేసిన ఈ జాబితాలో పలు కీలక స్థానాలకు అభ్యర్థులను నియమించింది. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ నుంచి బీజేపీ కీలక నేతను అభ్యర్థిగా ప్రకటించింది. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కె. సురేంద్రన్ బరిలోకి దిగుతున్నారు.
Read Also: BJP 5th List: బీజేపీ 5వ జాబితా రిలీజ్.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కి చోటు..
కె.సురేంద్రన్ ప్రస్తుతం కేరళ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అంతకు ముందు కేరళ బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా సురేంద్రన్ ఉన్నారు. కేరళలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా 2009లో కేరళ బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా కె.సురేంద్రన్ భారీ ర్యాలీ నిర్వహించారు. కేరళ సచివాలయంలోకి దూసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకునే క్రమంలో ర్యాలీలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. కేరళలోని “పథానంథిట్టా” లోక్‌సభ స్థానం నుంచి 2019లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో కాంగ్రెస్ గెలుపొందగా, రెండవ స్థానంలో సీపీఎం, మూడో స్థానంలో సురేంద్రన్ ఉన్నారు. 2020 ఫిబ్రవరిలో కేరళ బీజేపీ అధ్యక్షుడిగా కె. సురేంద్రన్ నియామకమయ్యారు.