BRS MLA Harish Rao on Medak BJP Candidate Raghunandan Rao: దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం ఒక్క బీజేపీ పార్టీకే సాధ్యం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అంత భక్తుడు ఎవరన్నా ఉన్నారా?.. ఆయన చేసిన యజ్ఞ, యాగాదులు ఎవరన్నా చేశారా? అని ప్రశ్నించారు. దేవుడిపై ఎంతో భక్తి ఉన్న కేసీఆర్.. ఏనాడు రాజకీయాలకు వాడుకోలేదన్నారు. రఘునందన్ రావు డోఖా చేయడంతోనే దుబ్బాకలో ప్రజలు ఓడగొట్టారు.. ఈసారి కూడా డిపాజిట్ కోల్పోవడం ఖాయం అని హరీశ్ రావు అన్నారు. మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డిని గెలిపించాలని కోరారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొంటున్నారు. నేడు సిద్దిపేటలో ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ‘అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీతో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి.. నిండు అసెంబ్లీలో చేతులెత్తేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువును వెంట తీసుకువచ్చింది. సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి రూ.150 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేశారు. వెటర్నరీ కళాశాలను కొడంగల్‌కు తీసుకుపోయారు’ అని అన్నారు.
Also Read: Hyderabad Drugs: అమెజాన్ కొరియర్‌లో డ్రగ్స్ కలకలం.. 2 కేజీల గంజాయి సీజ్!
‘దేవుడిని రాజకీయాలకు వాడుకోవడం ఒక్క బీజేపీకే సాధ్యం. ఆ ఘనత బీజేపీ మాత్రమే దక్కుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంత భక్తుడు ఎవరన్నా ఉన్నారా?. ఆయన చేసిన యజ్ఞ, యాగాదులు ఎవరన్నా చేశారా?. అయినా కూడా దేవుడి పేరుని ఆయన రాజకీయాల కోసం వాడుకోలేదు. బీజేపీ లీడర్ రఘునందన్ రావు డోఖా చేయడంతోనే దుబ్బాకలో ఓడిపోయారు. ఈ సారి కూడా డిపాజిట్ కోల్పోవడం ఖాయం’ అని హరీశ్ రావు పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.