Himanta Biswa Sarma: కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోపై అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో భారత్ కంటే పొరుగున ఉన్న పాకిస్తాన్ ఎన్నికలకు సరిపోతుందని శనివారం ఆరోపించారు.
చేతకాక కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా విమర్షించారు. తన పార్టీ ప్రభుత్వం ఏమీ చేసిందో తెలియని పరిస్థితిలో రాహుల్ గాంధీ ఉన్నారన్నారు. 6 గ్యారంటీలను అమలు చేయకుండా అబద్ధాలు చెబుతున్నారని.. దమ్ము, ధైర్యం ఉంటే రాహుల్ గాంధీ గ్యారెంటీల అమలుపై చర్చకు సిద్దమా అంటూ బహిరంగంగా సవాల్ చేశారు.
Rajnath Singh: క్రికెట్లో బెస్ట్ ఫినిషర్ మహేంద్ర సింగ్ ధోని అయితే, భారత రాజకీయాల్లో ‘‘బెస్ట్ ఫినిషర్’’ రాహుల్ గాంధీ అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సెటైర్లు వేశారు.
PM Modi: నిన్న ప్రకటించిన కాంగ్రెస్ మేనిఫేస్టోపై ప్రధాని నరేంద్రమోడీ విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మేనిఫేస్టో అబద్ధాల మూ అని, ప్రతీ పేజీలో భారత్‌ని ముక్కలు చేసే ప్రయత్నాలే ఉన్నాయని ప్రధాని ఆరోపించారు.
Karnataka: బెంగళూర్ రామేశ్వర్ కేఫ్ బాంబు పేలుడు ఘటన కర్ణాటకలో రాజకీయ అస్త్రంగా మారింది. ఇటీవల బీజేపీ కార్యకర్తకు నిందితులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ ఓ వ్యక్తిని అరెస్ట్ చేసింది.
లోక్‌సభ ఎన్నికల కోసం ఇరు పార్టీల మధ్య పొత్తుపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ లపై ప్రధాని నరేంద్ర మోదీ కాస్త ఘాటుగానే స్పందించారు. యుపి ర్యాలీలో శనివారం నాడు ఆయన మాట్లుడుతూ.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో విఫలమైన భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు. “దో లడ్కోన్ కి ఫ్లాప్ ఫిల్మ్” మళ్లీ విడుదలైంది అంటూ .. రాహుల్ గాంధీ, అధినేత అఖిలేష్ యాదవ్ లపై కాస్త గట్టిగానే విరుచుక పడ్డారు.…