పార్లమెంట్లో ఈ-సిగరెట్ వివాదం ఇంకా కొనసాగుతోంది. గత వారం బీజేపీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ లోపల ఈ-సిగరెట్ తాగేందుకు అనుమతి ఉందా? అంటూ స్పీకర్ ఓం బిర్లాను ప్రశ్నించారు. అందుకు సమాధానంగా స్పీకర్ లేదని చెప్పారు.
ఏపీ బీజేపీలో కష్టపడి పని చేస్తే పదవులు రావా? పనీ పాటా లేకుండా… ఏళ్ళ తరబడి జస్ట్ అలా.. అలా… టైంపాస్ చేస్తూ కూర్చుంటే పోస్ట్‌లు వాటంతట అవే పరుగులు పెట్టుకుంటూ వచ్చి ఒళ్ళో వాలిపోతాయా? కేడర్‌లో అదే అభిప్రాయం బలపడుతోందా? ఆంధ్రా కాషాయ దళంలో అసలేం జరుగుతోంది? మారుతున్న ఆలోచనా ధోరణి మొదటికే మోసం తెచ్చే ప్రమాదం ఉందా? Also Read:Pawan Kalyan: ఒక్కో అభ్యర్థికి ఒక్కో కథ ఉంటుంది.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు…
కాంగ్రెస్ చేపట్టిన ఓట్ చోరీ సభలో ప్రధాని మోడీని దూషించారంటూ పార్లమెంట్ ఉభయ సభల్లో బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగానే అధికార పార్టీ సభ్యులు నిరసన చేపట్టారు. రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఏడాది ప్రారంభంలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ముందుగానే కమలనాథులు కసరత్తు ప్రారంభించారు. బీహార్‌లో ఘన విజయం సాధించడంతో మంచి జోష్ మీద ఉన్న నాయకులు... త్వరలో జరగనున్న ఎన్నికల రాష్ట్రాలపై దృష్టి పెట్టారు.
Sarpanch Election: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరామ్‌నగర్ గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. మామపై కోడలు పోటీ చేసి విజయం సాధించింది.
Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఆదివారం నాడు జరిగిన మలి విడత ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది.
CM Revanth Reddy : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఓట్ చోర్, గద్దీ ఛోడ్’ మహా ధర్నాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగిన ఈ భారీ నిరసన కార్యక్రమంలో ఆయన బీజేపీతో పాటు ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని లక్ష్యంగా చేసుకున్న రేవంత్ రెడ్డి, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు, పేదల ఓటు హక్కును హరించాలనే ప్రయత్నాలు గతంలో జరిగినట్టు గుర్తు చేశారు.…
Nitin Nabin: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబిన్‌ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ జారీ చేసిన అధికారిక ఉత్తర్వులో ఈ నియామకానికి పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. నబిన్ ప్రస్తుతం, బీహార్‌లో నితీష్ కుమాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయన రహదారుల నిర్మాణ శాఖను చూస్తున్నారు.
Congress: బీజేపీ, ఎన్నికల సంఘం కలిసి ‘‘ఓట్ చోరీ’’కి పాల్పడిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఈ రోజు(ఆదివారం) ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు తీవ్ర ఆరోపణలు చేశారు. అండమాన్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ..
BJP: ‘‘ ఓట్ చోరీ’’పై భారీ ర్యాలీకి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అయితే, ర్యాలీ వేదిక వద్ద ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి పలువురు కార్యకర్తలు విద్వేష వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ప్రధాని మోడీని ‘‘అంతం చేయడమే’’ కాంగ్రెస్ అసలు లక్ష్యంగా ఉందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీ వేదిక వద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు వివాదాస్పద నినాదాలు చేసిన తర్వాత, బీజేపీ నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. “మోదీ, తేరీ…