PM Modi: బీజేపీ కొత్త అధ్యక్షుడి పిల్లలతో మోడీ సంభాషణ.. వీడియో వైరల్
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరణ
- ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో అట్టహాసంగా సాగిన కార్యక్రమం
- నితిన్ నబిన్ పిల్లలతో గడిపిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నితిన్ నబిన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్వయంగా ప్రధాని మోడీ.. కొత్త అధ్యక్షుడికి స్వీట్లు తినిపించి స్వాగతం పలికారు.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు బిగ్ షాక్.. కొత్త రికార్డ్ సృష్టించిన గోల్డ్ ధర
Also Read
- Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
- Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
- Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
- Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
పార్టీ కార్యాలయానికి కొత్త అధ్యక్షుడు నితిన్ నబిన్ కుటుంబ సభ్యులు వచ్చారు. ఈ సందర్భంగా నితిన్ నబిన్ పిల్లలతో ప్రధాని మోడీ కొద్దిసేపు కాలాక్షేపం చేశారు. ఇక కుమార్తె మారం చేయడంతో కొత్త అధ్యక్షుడు భుజంపైకి ఎక్కించుకున్నారు. దీంతో అక్కడే ప్లేట్లో ఉన్న స్వీట్లను మోడీ తీసుకుని చిన్నారులకు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
నితిన్ నబిన్..
చిన్న వయసులో అధ్యక్ష స్థాయికి ఎదిగిన ఘనత నితిన్ నబిన్(45)కే దక్కింది. నితిన్ నబిన్ 1980లో రాంచీలో జన్మించారు. తండ్రి కిశోర్ ప్రసాద్ సిన్హా మరణించాక 2006లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో పాట్నా వెస్ట్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం వరుసగా బంకిపూర్ అసెంబ్లీ నుంచి 2010, 2015, 2020, 2025 ఎన్నికల్లో విజయం సాధించారు. ఆర్ఎస్ఎస్ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. డిసెంబర్ 14న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చని ప్రచారం జరిగింది. చివరికి అదే నిజమైంది. ఇక అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక అనేక సవాళ్లు ఉన్నాయి. త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు నితిన్ నబిన్‌కు తొలి పరీక్ష కానుంది.
తాజావార్తలు
-
CM Chandrababu: అక్కడే కూటమికి బీజం పడింది.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
-
Ind A vs NZ A: పడిక్కల్ మారథాన్ ఇన్నింగ్స్ వృథా.. భారత్ చేతుల్లోంచి జారిన అద్భుత విజయం..!
-
Pawan Kalyan: బీఫామ్ వచ్చిన వారే పోటీ చేయాలి.. ఔత్సాహికులకు తప్పకుండా న్యాయం చేస్తాం!
-
Dhanush: విజయ్ బాటలో ధనుష్.. పొలిటికల్ ఎంట్రీకి రెడీ!?
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
ట్రెండింగ్
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!
-
Kitchen Cleaning Tips: మాడిపోయిన గిన్నెలను మెరిపించే సింపుల్ ట్రిక్స్.. ఈ 5 పద్ధతులతో నిమిషాల్లో క్లీన్ చేయండి!
-
Ragi Samosa Recipe: మైదాకు చెక్.. రాగితో టేస్టీ, హెల్తీ సమోసాలు ట్రై చేయండి.. తయారీ విధానం ఇదిగో!
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!