ఆర్ఎస్ఎస్ ఏ రాజకీయ పార్టీకి రిమోట్ కంట్రోల్ కాదని.. సమాజాన్ని నిర్మించే ఒక సంస్థ అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లోని రవీంద్ర భవన్లో జరిగిన కార్యక్రమంలో హిందూత్వం, భాష-సంస్థాగత విస్తరణ, ఆర్ఎస్ఎస్-బీజేపీ సంబంధాలపై మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ను బీజేపీ లేదా విశ్వహిందూ పరిషత్ కోణంలో చూడొద్దన్నారు.
దేశ వ్యాప్తంగా బీజేపీ, ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శిస్తున్నారు. డిజిటల్ బోర్డుపై ఆధారాలు చూపిస్తూ ధ్వజమెత్తుతున్నారు.
langana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ( జనవరి 2న) పునఃప్రారంభం కానున్నాయి. తొలి రోజు జరిగిన స్పల్పకాలిక చర్చలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది.
Congress: మహారాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నేత నానా పటోలే, తన అగ్రనేత రాహుల్ గాంధీని ‘‘శ్రీరాముడి’’తో పోల్చడం వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది ‘‘అతి భజన ప్రో మ్యాక్స్’’గా అభివర్ణించింది. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని రాహుల్ గాంధీ సందర్శించకపోవడంపై అడిగిన ప్రశ్నకు నానా పటోలే సమాధానం ఇస్తూ.. ‘‘శ్రీరాముడు చేసిన పనినే రాహుల్ గాంధీ చేస్తున్నాడు’’ అని అన్నారు.
Mohan Bhagwat: భాషా వివాదాల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భాష, కులం, సంపద వంటి భేదాలను పక్కనపెట్టి సామాజక సామరస్యతను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతీ వ్యక్తి తన ఇంట్లో తప్పనిసరిగా మాతృభాష మాట్లాడాలని, అలాగే ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు ఆ ప్రాంతాల భాషను నేర్చుకోవాలని అన్నారు. భారత్ లోని అన్ని భాషలకు సమాన గౌరవం ఉందని ఆయన అన్నారు.
త్వరలోనే దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాలు ఒకెత్తు అయితే.. పశ్చిమ బెంగాల్ మరొకెత్తు. బెంగాల్లో ఎప్పటి నుంచో పాగా వేయాలని కాషాయ పార్టీ కలలు కంటోంది.
Perni Nani: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరి పాలన చూస్తుంటే ప్రజలు భయబ్రాంతులకు గురౌతున్నారని వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని అన్నారు.
Digvijaya Singh: బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, తాజాగా ఈ సంస్థలపై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని రాహుల్ గాంధీకి లేఖ రాసిన వారం తర్వాత కొత్త వివాదానికి తెర లేపారు. 1990ల నాటి ప్రధాని మోడీ, అద్వానీల బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ, బీజేపీ దాని సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై ప్రశంసించారు.
ఆర్థిక రాజధాని ముంబై మున్సిపల్ ఎన్నికలు జనవరి 15న జరగనున్నాయి. ఈ ఎన్నికలు ప్రధానంగా అధికార పార్టీకి చాలా కీలకం. అదే తరుణంలో శివసేన (యూబీటీ)కి కూడా అంతే ప్రాధాన్యం. ఇప్పటికే ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో భారీ విజయ నమోదు కావడంతో కూటమి ప్రభుత్వం మంచి జోష్లో ఉంది. ముంబైను కూడా సొంతం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది.