మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేతో సహా కీలకమైన 100కు పైగా నేతలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ ముగిసిన మరుసటి చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశ నెలకొంది. ఇక, కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే హరివల్లభ్ శుక్లా, ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమల్ సింగ్ రఘువంశీతో సహా పలువురు నేతలు బీజేపీలో చేరారు. వీరంద్దరూ సీఎం డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ కొత్త చేరికల సంఘం రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ నరోత్తమ్ మిశ్రా సమక్షంలో కమలం పార్టీలో జాయిన్ అయ్యారు.
Read Also: Saurabh Bhardwaj: కేజ్రీవాల్ను చంపేందుకు జైల్లో కుట్ర జరుగుతుంది..
ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచౌరీ, మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఉన్నారు. ప్రపంచంలోనే బీజేపీని అతిపెద్ద పార్టీగా తీర్చిదిద్దాలని, దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలనుకునే వారికి బీజేపీలోకి స్వాగతం పలుకుతున్నామని సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. బీజేపీ ప్రజాస్వామ్య రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో బంధుప్రీతి మాత్రమే కనిపిస్తోంది అని విమర్శలు గుప్పించారు. కాగా, రాష్ట్రంలో చింద్వారాతో సహా మొత్తం 29 స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మరోసారి మోడీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక, మాజీ సీఎం కమల్ నాథ్‌ను హేళన చేస్తూ సీఎం మోహన్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఓట్లు అడిగేందుకు మొదటిసారిగా పెద్ద మహారాజ్ ఓటర్ల మధ్యకు చేతులు జోడించి తన ఇంటి నుంచి బయటకు వచ్చారన్నారు. అతని చింద్వారా మోడల్ ఎంత దారుణంగా ఉందో అందరూ చూశారంటూ మండిపడ్డారు.
Read Also: Chandrababu: ఇదే నా జన్మదిన ఆశయం.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఇక, శివపురి మాజీ ఎమ్మెల్యే హరివల్లభ శుక్లా, ఎంపీ కాంగ్రెస్ సింధీ కళ్యాణ్ సమితి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మహేశ్ గుర్బానీ, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి కమల్ సింగ్ రఘువంశీ, శివపురిలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అలోక్ శుక్లా, సోషల్ మీడియా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు (టీమ్ కమల్ నాథ్) గౌరవ్ శర్మ, రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి అమిత్ దంత్రే, నర్మదాపురంలో కాంగ్రెస్ సేవాదళ్ ఉపాధ్యక్షుడు రాహుల్ సింగ్ సహా 100 మందికి పైగా కాంగ్రెస్ నేతలు భారతీయ జనతా పార్టీలో చేరారు.
#WATCH भापोल: मध्य प्रदेश के मुख्यमंत्री मोहन यादव ने कहा, "चारों तरफ से रुझान अनुकूल आ रहे हैं। प्रचंड बहुमत के साथ भाजपा की सरकार बनने जा रही है। फिर एक बार मोदी सरकार बनने जा रही है। छिंदवाड़ा सहित प्रदेश की 29 सीट हम जीतने की ओर बढ़ रहे हैं। पहली बार बड़े महाराज अपने घर से… pic.twitter.com/h6HTRZZ26l
— ANI_HindiNews (@AHindinews) April 20, 2024