బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్పై ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం తొలిసారి స్పందించారు. కవిత అరెస్ట్ ముమ్మాటికి అక్రమమేనన్నారు. లిక్కర్ స్కామ్ పాలసీ కుంభకోణంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని విమర్శలు గుప్పించారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు.
ఇండియా కూటమిలో ఆన్న మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ 400 స్థానాల్లో పోటీ చేసినా కూడా గెలిచే అవకాశం లేదని చెబుతుంది.. మరి ఏ రకంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి.. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేదు లేదు: ఎంపీ లక్ష్మణ్
104 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీ వాళ్ళు మన ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు.. అలాంటిది 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కాంగ్రెస్ సర్కార్ ను బీజేపీ వాళ్లు బతకానిస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి రుణమాఫీకి ఆగస్టు 15 అంటూ జనాలను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారు అని భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం అయింది..ప్రభుత్వం ఉంటదో ఉడుతుందో అనే కాంగ్రెస్ వాళ్లకు భయం పట్టుకుంది..
యువకులు కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తే అరవింద్ కు డిపాజిట్ కూడా రాదనీ జోస్యం చెప్పారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం గెలిస్తే దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది అని జీవన్ రెడ్డి తెలిపారు.
దేశంలో దళితులపై దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. భారతీయ జనతా పార్టీ కుట్రలను తిప్పికోట్టాలి.. బీజేపీ నేతలు రామున్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు.
దేవుడి పేరుతో బండి సంజయ్ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని పొన్నం ప్రభాకర్ చెప్పారు. సీట్లు ఓట్ల కోసం తల్లిని కూడా బండి సంజయ్ అవమానించాడు.. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రసాదం స్కీమ్ ను వేములవాడ, కొండగట్టు, ధర్మపురి ఆలయాలకి బండి సంజయ్ ఒక్క రూపాయి తీసుకు రాలేదన్నారు.
Ponnam Prabhakar: మోడీ ఫోటోతో ఓట్లు అడగండి రాముని ఫోటోతో కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని తెలిపారు.