BJP: బీజేపీ లోక్‌సభ అభ్యర్థి హఠాన్మరణం.. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ (72) హఠాన్మరణం చెందారు. పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం దేశ వ్యాప్తంగా తొలి విడత పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సర్వేష్ సింగ్ బరిలో ఉన్నారు. శుక్రవారం జరిగిన పోలింగ్‌లో ఆయన ఓటు కూడా వేశారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోకి ఎయిమ్స్‌కు తరలించారు. అనంతరం ఆయన గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి ధృవీకరించారు.
శుక్రవారం పోలింగ్ ముగిసిన కొన్ని గంటలకే అభ్యర్థి మరణించడంతో యూపీలోని మొరాదాబాద్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. మొరాదాబాద్‌లోని ఠాకూర్ స్థానం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన.. 2014లో పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
- Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?
- OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
సర్వేష్ సింగ్ మృతి పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కున్వర్ సర్వేష్ సింగ్ మరణం షాక్‌కు గురిచేసిందన్నారు. ఇది బీజేపీ కుటుంబానికి తీరని లోటు అని.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు శక్తిని ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్టు చేశారు. సర్వేష్ సింగ్ మృతి పట్ల బీజేపీ నేతలంతా విచారం వ్యక్తం చేస్తున్నారు.
సర్వేష్ సింగ్ మృతి పట్ల యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. దు:ఖంలో ఉన్న కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సర్వేష్ సింగ్ ఆత్మకు శాంతి కూరాలని ప్రార్థిస్తున్నట్లు అఖిలేష్ ట్వీట్ చేశారు.
मुरादाबाद लोकसभा क्षेत्र से भाजपा प्रत्याशी एवं पूर्व सांसद कुंवर सर्वेश सिंह जी के निधन से स्तब्ध हूं। ये भाजपा परिवार के लिए अपूरणीय क्षति है।
मेरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं।
प्रभु श्री राम से प्रार्थना है कि दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान तथा…
— Yogi Adityanath (@myogiadityanath) April 20, 2024
తాజావార్తలు
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
-
CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!