Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తే.. రాత్రికి రాత్రే బీఆర్ఎస్ ను నామరూపాలు లేకుండా చేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. భువనగిరి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. తనకు రాజకీయంగా పునర్జన్మ, రాజగోపాల్ రెడ్డి కి రాజకీయ జన్మ ఇచ్చింది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గమన్నారు. పోటరాటాల ఖిల్లా, కాంగ్రెస్ కంచుకోట భువనగిరిలో భారీ మెజారిటీతో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. భువనగిరిలో కాంగ్రెస్ కు పోటీ లేదని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నా.. వంద రోజులకే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా తెలంగాణకు చేసింది శూన్యమని విమర్శించారు.
READ MORE: Wife Kills Husband: ప్రియుడి సాయంతో భర్తను చంపిన భార్య.. రోడ్డు ప్రమాదమని నాటకం..
ప్రతిపక్ష పార్టీ నేతగా ఉన్న తాను రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి నిధులు తీసుకువచ్చానన్నారు. సీఎం గా ఉండి లక్షల సార్లు కేసీఆర్ అబద్ధాలు చెప్పాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నాకు అత్యంత సన్నిహితుడని, సోదరసమానుడన్నారు. 20 ఏళ్లు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని జోష్యం చెప్పారు. 10 ఏళ్ల పాలనలో లక్ష రూపాయల రుణమాఫీ చేయని కేసిఆర్ కు రుణమాఫీ పై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఓ వేస్ట్ ఫెలో ఆయన గురించి మాట్లాడి సమయం వృథా చేయనన్నారు.
అనంతరం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఇప్పుడే ఆట మొదలైందని.. రేవంత్ రెడ్డికి ఇరు వైపులా కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చిన్న పొరపాటుతో ఒక్క సీటు కోల్పోయామని.. ఈ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా చామాల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.