మల్కాజిగిరికి ఈటల సరిపోతారని హైకమాండ్ టికెట్ ఇచ్చిందని, బీజేపీ సోషల్ ఇంజినీరింగ్‌లో నెంబర్‌వన్ అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ సారి మోడీని ప్రధానిని చేయాలన్న భావన ప్రజల్లో కనిపిస్తోందన్నారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొందరు నేతలు ( సచిన్ పైలట్ ) పగటి కలలు కంటున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు.
అసలైన దేశ భక్తుల కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమేనని.. బీజేపీ నేతలు డూప్లికేట్ దేశభక్తులు అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాళ్లు గ్రాఫిక్స్ లీడర్స్ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈద్ జరుపుకునేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వచ్చిన వలస కూలీలు ఓటు వేయకుండా తిరిగి వెళ్లొద్దని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. మీరు లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయకుంటే కాషాయ పాలకులు మీ ఆధార్ కార్డు, పౌరసత్వాన్ని తీసేస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో బీజేపీ కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ఆభ్యర్ధి తాండ్ర వినోద్ రావు గెలుపును కాంక్షిస్తూ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించారు.
నిజామాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా ఎంపీ ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు. పసుపు రైతులతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అర్వింద్ నామినేషన్‌కు చందాల రూపంలో రుసుము జమ చేసి పసుపు రైతులు ఇచ్చారు. ఆ డబ్బుతోనే డిపాజిట్ చెల్లించి ధర్మపురి అర్వింద్ నామినేషన్ దాఖలు చేశారు.
మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. గురువారం రోజు కిరణ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ రోజు కౌంటర్ ఇచ్చారు మంత్రి పెద్దిరెడ్డి.. చిత్తూరు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పదేళ్లు అజ్ఞాతంలో ఉండి ఇప్పుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు అని ఫైర్ అయ్యారు.. నేను కాంగ్రెస్ లో ఉండి సోనియా గాంధీ కాళ్లకే మొక్కలేదు.. కానీ, కిరణ్ కుమార్ రెడ్డి…
Mallu Bhatti Vikramarka: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. అలాంటి వారిపై కేసులు పెడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు.