Etela Rajender: 14 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడిన పేరు కేసీఆర్ కి రావొచ్చు కానీ కష్టపడింది మేము అని మల్కాజ్‌గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని అస్మద్ పేటలో… పప్పుపటేల్ నివాసంలో స్థానికులు ఏర్పాటుచేసిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కి ఈటల రాజేందర్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మొదటి సారి అనుకుంటా.. ఓటు వేయడానికి ఇష్టపడని వారు కూడా మోడీ గారి పదేళ్ల పాలన చూసి ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. మోడీ నాయకత్వంలోనే దేశం పురోభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారని అన్నారు. 2014లో 273 సీట్లతో సంకీర్ణ రాజకీయాలకు స్వస్తిపలికిన నాయకుడు మోడీ అన్నారు.
మోడీ మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. మొదటిసారి ఎంపీగా గెలిచి ప్రధాని అయ్యారని ఇది చాలా అరుదు. మోడీలొ ఏదో తెలియని ప్రత్యేకత ఉంది.. ఆయన చేసే పనే మాట్లాడుతుందన్నారు. పక్కదేశాలు భారత్ భూమిని ఇంచుకూడా ఆక్రమించుకోకుండా చేశారన్నారు. మనవైపు కన్నెత్తి చూడడానికే భయపడుతున్నారని తెలిపారు. కాశ్మీర్ లోని లాల్ చౌక్ లో భారత మువ్వన్నెల జెండా స్వేచ్ఛగా ఎగురవేస్తున్నామని తెలిపారు. ఒకే దేశం ఒకే చట్టం ఒక కల ఉండే.. దానిని నిజం చేశారు మోడీ అన్నారు. మోడీకి ఒకప్పుడు అమెరికా వీసా నిరాకరిస్తే.. ఇప్పుడు వారి సెనేట్ లో జై మోడీ అని చప్పట్లు కొట్టించుకున్నారు. అమెరికా అధ్యక్షుని భుజం మీద చేయి వేసి మాట్లాడే స్థాయికి వచ్చామన్నారు. అప్పులు తెస్తే తప్ప గడవని భారతదేశ ఆర్థిక వ్యవస్థను 11 వ స్థానం నుండి 5 స్థానానికి తీసుకువచ్చారు. మళ్ళీ అధికారం ఇస్తే మూడవ స్థానానికి తీసుకువస్తాం అనీ హామీ ఇస్తున్నారన్నారు. ఎదిగిన దేశాల సరసన నిలబెడతామంటున్నారని తెలిపారు. మోడీ కంటే ముందు 3 ఎయిమ్స్ ఉంటే ఈ పదేళ్లలో 16 ఎయిమ్స్ వచ్చాయి.
ఏం చేశారు అని కాంగ్రెస్ వారు ఓటు అడుగుతారు.. వారికి నైతికత లేదన్నారు. గునియ దేశానికి వాక్సిన్ అందించినందుకు.. మోదీ అదేశానికి వెలితే దేశ సంప్రదాయాలు పక్కనపెట్టి స్వాగతం పలకడమే కాకుండా.. ఆ దేశ అధ్యక్షుడు మోడీ గారికి పాదాబివందనం చేశారు అంటే మన గొప్పతనం అర్థం చేసుకోవాలన్నారు.
కోల్పోయిన రామాలయాన్ని తిరిగి నిర్మించి దేశానికి ఉన్న అరిష్టాన్ని తొలగించిన నాయకుడు మోడీ అన్నారు. మోడీ అందరివాడు.. ఏ మత గ్రంథాలు మానవుణ్ణి హింసించమని, బాధ పెట్టమని చెప్పవన్నారు. ట్రిపుల్ తలాక్ తొలగించి ముస్లిం మహిళల అభిమానం చూరగొన్నారని, వారి దుఃఖాన్ని తొలగించారన్నారు. ఓట్ల కోసం కాకుండా.. ప్రజలకోసం నిర్ణయం తీసుకునే నాయకుడన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు ఇర్రలవెంట్ అన్నారు. కాంగ్రెస్ వారు 6 గ్యారంటీలు.. 66 హామీలు ఇచ్చారన్నారు.
ఎవడు ఎటుపోతే నాకేంటి నేను సీఎం అయితే చాలు.. నా పార్టీ అధికారంలోకి వస్తే ఎలా చాలు అని అడ్డమైన ప్రకటనలు చేశారని, నీతి జాతి లేదని మండిపడ్డారు.
అదే మోడీ ఎప్పడు అలవికాని హామీలు ఇవ్వలేదని, ఆయనకు కొడుకులు, బిడ్డలు, సద్దకుని కొడుకులు లేరని, ఆయన బ్రతికితే దేశం కోసం, చనిపోతే దేశంకోసం చనిపోతారన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసిన మాట నిజమే అయితే.. ఎందుకు టాయిలెట్స్ లేవని, 12 కోట్ల టాయిలెట్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవం కాపాడారన్నారు. నేను 14 ఏళ్లు తెలంగాణ కోసం కొట్లాడిన.. పేరు కేసీఆర్ కి రావొచ్చు కానీ కష్టపడింది మేమని కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రాణాలు పణంగా పెట్టి పేషంట్ల మధ్య తిరిగిన బిడ్డను నేనని, ఎవరికి తలవంచకుండా ప్రజల బాగు ఎజెండాగా బ్రతుకుతున్నామన్నారు. రాజకీయాలను స్వలాభం కోసం కాకుండా.. ప్రజల కోసం అనే భావన ఉన్నవాళ్ళమన్నారు.
మల్కాజిగిరి సంపూర్ణ అభివృద్ధి ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. శశభిషలు లేకుండా సంపూర్ణంగా ఆశీర్వదించాలని కోరారు. 38 లక్షల ఓటర్లను నేను నేరుగా కలిసే అవకాశం లేదు.. మీరే కథానాయకులై గెలిపించాలని కోరుతున్నామన్నారు. కంటోన్మెంట్ అభ్యర్థి వంశ తిలక్ గొప్ప చదువులు చదువుకున్నారు. డాబు దర్పం లేకపోవచ్చు కానీ సంస్కారవంతుడు. గెలిపిస్తే మచ్చ తేని నాయకుడు. ఆయనను కూడా ఆశీర్వదించమని కోరుతున్నామని, కాంగ్రెస్, BRS అభ్యర్థులు మల్కాజగిరికి ఏం చేస్తారో అడగండి? ప్రజలకు తెలిపారు. రియల్ ఎస్టేట్ చేస్తే చేసుకోమనండి. ఈ రాజకీయాలు ఎందుకు వారికి అంటూ మండిపడ్డారు.
Dr K Laxman: భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం పని చేయడమే మోడీ లక్ష్యం..