Dr K Laxman: భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం పని చేయడమే మోడీ లక్ష్యమని ఎంపీ రాజ్యసభ లక్ష్మణ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని కీస్ హై స్కూల్ లో తమిళ తులువా వెళ్లాల (ముదాలియర్) కమ్యూనిటీ వారు నిర్వహించిన తమిళ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కార్యక్రమానికి బిజెపి రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. తమిళ సోదరులందరికి తమిళ న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. నిజాం పరిపాలన అనంతరం తమిళనాడు నుండి చాల మంది హైదరాబాద్ వచ్చి సెట్టెల్ అయ్యారని అన్నారు. సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడి ఎదుగుగారు అంటే చాల సంతోషమన్నారు.
తమిళనాడుతో దేశం మొత్తం ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. దేశంలో అనేక ప్రాంతం లో తమిళ భాషను గుర్తిస్తున్నారని తెలిపారు. ప్రధాని కూడా తమిళ భాషను ప్రత్యేకంగా గుర్తించారని అన్నారు. అనేక రంగాల్లో తమిళులు ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. ప్రధాని మన్ కి బాత్ కార్యక్రమంలో కూడా తమిళుల గురించి మాట్లాడిన సందర్భం ఉందన్నారు. తమిళ ప్రజలన్న తమిళ భాషన్న కూడా ప్రధానికి ప్రత్యేక అభిమానం ఉందన్నారు. కాశీకి రామేశ్వరానికి ఉన్న సంబంధాన్ని గుర్తించింది కూడా ప్రధాని మోడీ నే అన్నారు. తమిళ చరిత్రను డిల్లీ వరకు చేర్చారని తెలిపారు. ముదలియర్ కమ్యూనిటీ వారు ఎక్కువగా ఇక్కడ స్థిరపడ్డారని తెలిపారు. వారికి తగిన గుర్తింపు కావాలని ఈ సంఘం వారు కోరుతున్నారని అన్నారు.
గతంలో ఇక్కడ బీసీ లుగా వారిని గుర్తించామన్నారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓబీసీ లో గుర్తింపు కావాలని వారు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఓబీసీ జాబితాలో లేకపోవడం వల్ల వారు సైనిక్ స్కూల్లో, నవోదయ స్కూల్ లో రిజర్వేషన్ దక్కించుకోలేక పోతున్నామని తెలియజేశారు. జాతీయ స్థాయిలో వారి కమ్యూనిటీ నీ ఓబీసీ లిస్ట్ లో చేర్చితే ఈ సమస్య తీరుతుందని నా దృష్టి కి తీసుకొచ్చారని తెలిపారు. నేను ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడి హోదాలో మీ సమస్యను తీర్చడానికి కృషి చేస్తానని తెలిపారు. జాతీయ స్థాయిలో 27 శాతం రిజర్వేషన్ కూడా విద్యారంగంలో ఇప్పించేందుకు కృషి చేస్తానని అన్నారు.
విసెన్ ఉన్న గొప్ప వ్యక్తి మన ప్రధాని మోడీ అని తెలిపారు. భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం పని చేయడమే మోడీ లక్ష్యమన్నారు. అందుకే యువతకు స్కిల్ డెవలప్మెంట్ సంబంధిత కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. దేశంలో వారి వారి కుటుంబ సభ్యుల కోసం రాజకీయాలు చేస్తున్నారని తెలిపారు. కానీ మోడీ మాత్రం దేశ ప్రజలే నా కుటుంబం అనుకుని పని చేస్తున్నారని తెలిపారు. మూడో సారి కూడా మోది నే ప్రధాని అవ్వబోతున్నారని పేర్కొన్నారు.
Thalapathy Vijay: స్టార్ హీరో విజయ్‌పై కేసు నమోదు!