Asaduddin Owaisi: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ‘‘ఎక్కువ పిల్లలు ఉన్నవారు’’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గత పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండలేకపోతుందని ఆరోపించారు. మేము మా కుటుంబం మాత్రమే దేశాన్ని పరిపాలించాలి అనే దుర్మార్గపు ఆలోచనతో సోనియా గాంధీ ఉందని పేర్కొన్నారు. మరోవైపు.. రాహుల్ గాంధీ జోడో యాత్రను ప్రజలు పట్టించుకోలేదని అన్నారు. రాహుల్ గాంధీ చేసింది భారత్ జోడో యాత్ర కాదు తోడో యాత్ర అని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ…
మెదక్ లో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రఘునందన్ రావు కౌంటర్ ఇచ్చారు. బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి దుష్ప్రచారం ప్రారంభించారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేసే కుట్ర చేస్తుందని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మోడీ మారుస్తాడని రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దేశంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలపై సర్జికల్ స్ట్రైక్ జరుగుతుందని…
రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. బీజేపీ శ్రేణులతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు.
Thummala Nageswara Rao: గోరానున్న రోజుల్లో వైరా ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీళ్లను తెచ్చి లంకాసాగర్ ప్రాజెక్ట్ నింపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎంపి అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు.
Aravind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మద్దతుగా ఈరోజు (ఏప్రిల్ 28) 'వాక్ ఫర్ కేజ్రీవాల్' వాకథాన్ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి అతిషి మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారని అన్నారు.
Minister Seethakka: బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా- శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క హాట్ కామెంట్స్ చేశారు. పదేళ్ళ బీజేపీ పాలనలో ఏం చేసింది? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మన సంపదను ముస్లింకు పంపిణీ చేస్తామంటున్న కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుక విదేశీ హస్తం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KCR: నేడు వరంగల్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సుయాత్ర చేరుకోనుంది. హనుమకొండ చౌరస్తాలో మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు. భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు వరంగల్ నగరానికి వెళ్లనున్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తనపై ప్రతిపక్ష నాయకురాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చేసిన ఆరోపణలపై హోమ్ మినిస్టర్ తానేటి వనిత స్పందించారు.