దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్నాయి. ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రెండు విడతల్లో పోలింగ్ ముగిసింది. ఇక మూడో విడత పోలింగ్ మే 7న జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే సోమవారం కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.. అమేథీ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అఫిడవిట్ దాఖలుతో కీలక విషయాలు బయటకు వచ్చాయి. గత ఐదేళ్లలో స్మృతి ఇరానీ ఆస్తులు పెరగడం విశేషం. స్మృతి ఇరానీ స్థిరాస్తుల విలువ రూ.17 కోట్లు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తానికి గత ఐదేళ్లలో కేంద్రమంత్రి ఆస్తులు రూ.6 కోట్లు పెరిగాయి. ఎలాంటి క్రిమినల్ కేసులు లేనట్లుగా ఎన్నికల అఫిడవిట్‌లో స్మృతి ఇరానీ వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Viral Video : డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలి చనిపోయిన యువతి
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో స్మృతి ఇరానీ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 11 కోట్లు కాగా.. ఇప్పుడు రూ. 17 కోట్లుగా పేర్కొన్నారు. అంటే గత ఐదేళ్లలో స్మృతి ఇరానీ కుటుంబ సంపద సుమారు రూ. 6 కోట్లు పెరిగింది. స్మృతి ఇరానీకి చెందిన చరాస్తులు రూ. 25,48,000 ఐదు పొదుపు ఖాతాలలో డిపాజిట్ చేయబడింది. రూ. 88 లక్షలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్/పోస్టాఫీసు బ్యాలెన్స్ విలువ రూ. 30,77,936గా ఉంది. 2023లో కారును కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. ఇక ఆభరణాల విలువ రూ. 37,48,440గా చూపించారు. స్థిరాస్తుల్లో ఆరు వ్యవసాయ భూములు, ఒక వ్యవసాయేతర భూమి ఉంది. అలాగే నాలుగు ఇళ్లు ఉన్నట్లుగా తెలిపారు. ముంబయిలో రెండు, గోవాలో ఒకటి, పూణేలో మరొకటి ఉన్నట్లుగా వివరించారు.
ఇది కూడా చదవండి: TS SSC Supplementary: జూన్ 3వ తేదీ నుండి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు..
అమేథీ లోక్‌సభ స్థానానికి ఐదో విడతలో పోలింగ్ జరగనుంది. అనగా మే 20న ఓటింగ్ జరగనుంది. ఇప్పటికే బీజేపీ నుంచి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ నామినేషన్ వేశారు. కానీ కాంగ్రెస్ నుంచి మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ఇక్కడ రాహుల్ గాంధీ ఓడిపోయారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. దాదాపు 55 వేల ఓట్ల మెజార్టీతో కేంద్రమంత్రి గెలిచారు. ఈసారి కాంగ్రెస్ నుంచి ఎవరో ఇంకా తెలియలేదు. రాహుల్ పోటీ చేస్తారా? లేదంటే ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారా? అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.
అమేథీలో 2004 నుంచి 2019 మధ్య మూడు పర్యాయాలు రాహుల్ గాంధీని ఎన్నుకున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఈ స్థానం నుంచి 1981 నుంచి 1991 మధ్య నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు. రాజీవ్ సోదరుడు సంజయ్ కూడా కొంతకాలం ఈ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు.
ఇది కూడా చదవండి: Namburu Sankara Rao: సీఎం జగన్ రుణం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది..