కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో హోం మంత్రిత్వ శాఖ, బీజేపీల ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారు. దీంతో ఆయనపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోడీని అనర్హులుగా ప్రకటించడంతో పాటు ఆరేళ్ల పాటు నిషేధించాలని పిటిషన్లో తెలిపారు.
దేశంలో ఆరో దశలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ దశలో బీహార్, హర్యానా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో జరిగిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ (సోమవారం) విచారణ చేపట్టనుంది.
మల్కాజ్గిరి కార్నర్ మీటింగ్లో బీఆర్ఎస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ చచ్చిన పాముతో సమానం.. కారు కార్ఖానాకు పోయింది... ఇక అది వాపస్ రాదని విమర్శించారు. అందుకే కేసీఆర్ కారు వదిలి బస్సు ఎక్కారని దుయ్యబట్టారు. కేసీఆర్ బస్సు యాత్ర.. తిక్కలోడు తిరునాళ్లకు వెళ్లినట్లే ఉందని విమర్శించారు. వంద రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసిన మమ్మల్ని కేసీఆర్ తిట్టుకుంటూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేసీఆర్ దివాళాకోరుతనానికి, చేతకానితనానికి…
మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్ వాళ్లు గజగజ వణుకుతున్నారని అన్నారు. ఢిల్లీకి వెళ్లి మోడీతో రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యాడని తెలిపారు. నాలుగున్నర నెలల కాంగ్రెస్ పాలనలో తిట్లు లేకపోతే దేవుని మీద ఒట్టు అని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 2 లక్షల…
Amit Shah: రిజర్వేషన్లను తొలగించేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీల రిజర్వేషన్లను బీజేపీ తొలగించదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు.
Asaduddin Owaisi: రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ ‘‘ఎక్కువ పిల్లలు ఉన్నవారు’’ అంటూ కామెంట్స్ చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు.