Aroori Ramesh: పిచ్చిగా మాట్లాడితే దళిత వర్గాలు ఊరుకోరు.. కడియంపై ఆరూరి కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aroori Ramesh: పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దళిత వర్గాలు చూస్తూ ఊరుకోదని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నా అని బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లాలో బీజేపీ వరంగల్ ఎంపీ అభ్యర్థి అరూరి రమేష్ పై కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై ఆరూరి స్పందించారు. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ మాట్లాడుతూ.. కడియం శ్రీహరి ఈ మధ్య ఆగం ఆగం చేస్తున్నారని తెలిపారు, ఏం మాట్లాడుతుండో అర్థం కావడం లేదన్నారు. నేను వ్యాపారవేత్తగా రాజకీయాల్లోకి వచ్చి నలుగురికి సహాయం చేశా అన్నారు. కడియం నువ్వు ఏం చేశావని నీకు సంపాదన ఎక్కడిది అన్నారు. కబ్జాలు చేసింది మేము కాదు,కబ్జాలు చేసింది నువ్వు అంటూ ధ్వజమెత్తారు.
Read also: Naveen Patnaik: హింజిలి అసెంబ్లీ స్థానానికి సీఎం నామినేషన్ దాఖలు
Also Read
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
- Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
టీడీపీలో, బీఆర్ఎస్ లో మా దళితుల ఎమ్మెల్యే సీట్లను కబ్జా చేసింది నువ్వు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వరంగల్ పార్లమెంట్ లో మా దళితులకు రావాల్సిన సీటు కబ్జా చేసింది నువ్వన్నారు. మా రాజకీయ భవిష్యత్తును దెబ్బకొట్టి, నీ బిడ్డను ఎంపీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నావ్ అని కీలక వ్యాఖ్యలు చేశారు. నేను వ్యాపారాలు చేసి రాజకీయాలు చేస్తున్న అని బల్లగుద్ది చెప్తున్న అని తెలిపారు. ఏం వ్యాపారాలు చేసావని ధర్మసాగర్ లో భూములు, అద్దాల భవనం,హైదరాబాదులో విల్లాలు, బెంగళూరులో ఆస్తులు ఎక్కడివి? అని ప్రశ్నించారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దళిత వర్గాలు చూస్తూ ఊరుకోదని,తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
Uttarpradesh : విడాకులు తీసుకున్న కూతురిని బ్యాండ్ భాజాలతో ఇంటికి తెచ్చుకున్న తండ్రి
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!