ఈ ఎన్నికల్లో మోడీకే వేస్తామని ప్రజలు అంటున్నారు… దేశ భవిష్యత్, మా భవిష్యత్ ముఖ్యం అని అంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ జహీరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు గ్రామాలు తీర్మానం చేసుకుంటున్నాయని, బీజేపీ బలపడుతుంటే కాంగ్రెస్, BRS గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ పార్టీ వల్ల బీసీ లకు అన్యాయం జరుగుతుంది… గ్రేటర్ కార్పొరేషన్ లో బీసీ లకు 50 సీట్లు ఉంటే అందులో 31 మంది నాన్ బీసీ గెలిచారని ఆయన అన్నారు. ముస్లిం రిజర్వేషన్ ల వల్ల బీసీ లకు అన్యాయం జరిగిందని, తెలంగాణ మీ వెనక ఉందని మోడీ కి తెలుపుదామన్నారు కిషన్ రెడ్డి. దేశంలో, రాష్ట్రంలో ప్రధాని మోడీ హవా కొనసాగుతుందని.. తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు.
ఈ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని.. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమపై విమర్శలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అలాగే నేటి నుంచి రాష్ట్రంతో ప్రధాని మోడీ వరుస సభలో పాల్గొంటారు.. కాసేపట్లో ఆయన తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. అలాగే ఈ నెల 10 ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోడీతో భారీ బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. అంతేకాకుండా..’తెలంగాణలో 17 కి 17 స్థానాలు గెలవడానికి బీజేపీ కృషి చేస్తోంది. ప్రధాని మోడీతో దేశ గౌరవం పెరిగింది. బీజేపీ బలపడితే కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అందుకే బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, Brs పార్టీలు రెండు ఒక్కటే’ అని కిషన్ రెడ్డి అన్నారు.