పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హాల్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రేఖా పాత్రకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రత కల్పించింది. సందేశ్‌ఖాలీలో షేక్ షాజహాన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనకు రేఖా పాత్ర నాయకత్వం వహించింది. ఇప్పుడు ఆమెకు ‘ఎక్స్-కేటగిరీ’ భద్రత కల్పించారు. అలాగే, బీజేపీ కూడా రేఖ పాత్రను బసిర్‌హత్ లోక్‌సభ స్థానం నుంచి పోటీలో నిలిపింది. రేఖకు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండోలు రక్షణ కల్పిస్తారు.
Read Also: Osmania University: మే నెల మొత్తం ఓయూ బంద్.. చీఫ్ వార్డెన్ నోటీస్..
కాగా, లోక్‌సభ ఎన్నికల చివరి దశ జూన్ 1వ తేదీన బసిర్‌హత్ లో పోలింగ్ జరగనుంది. సిట్టింగ్ ఎంపీ, బెంగాలీ నటి నుస్రత్ జహాన్ స్థానంలో నామినేట్ చేయబడిన తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన హాజీ నూరుల్ ఇస్లామ్‌పై రేఖా పాత్ర పోటీ చేయబోతుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికలో రేఖ పాత్రకు ముప్పు ఉందని పేర్కొనడంతో ఆమెకు ‘ఎక్స్-కేటగిరీ’ భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. రేఖ పాత్రతో పాటు మరో ఐదుగురు బీజేపీ నేతలకు కూడా హోం శాఖ భద్రత కేటాయించింది.
Read Also: Amit Shah : అమిత్ షా ఫేక్ వీడియో.. తెలంగాణ కాకుండా మరో రెండు రాష్ట్రాల్లో దర్యాప్తు
ఇక, ఝర్‌గ్రామ్ నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న ప్రణత్ తుడుతో పాటు బహరంపూర్ నుంచి నిర్మల్ సాహా, జయనగర్ నుంచి అశోక్ కందారీ, మధురాపూర్ నుంచి అశోక్ పుర్‌కైత్‌లకు ‘ఎక్స్-కేటగిరీ’ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రత్వ శాఖ తెలిపింది. కాగా, రాయ్‌గంజ్ బీజేపీ అభ్యర్థి కార్తీక్ పాల్‌కు ‘వై కేటగిరీ’ భద్రతను కేటాయింది. ఈ నెల ప్రారంభంలో లోక్‌సభ ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుంచి పశ్చిమ బెంగాల్‌లోని బీజేపీ నేతలకు కేంద్ర హోంశాఖ భద్రతను కల్పించింది. అయితే, ప్రస్తుతం 100 మందికి పైగా బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది.