BJP New President: భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలం ముగిసిపోవడంతో పార్టీ తదుపరి అధ్యక్ష పగ్గాలు ఎవరికి అప్పగిస్తారో అనే విషయం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. జులై నెలలో తదుపరి అధ్యక్షుడు బాధ్యతలు చేపడతారని సంబంధిత వర్గాలు తెలిపినప్పటికి.. తాజాగా ఆగస్టు నెల చివరి నాటికి కొత్త అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం 2024 జూన్‌లోనే ముగిసిపోయింది.. అయితే గతేడాది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆమోదించిన తీర్మానం ప్రకారం.. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆయన అధికారంలో ఉండనున్నారు. కానీ మోడీ 3.0 ప్రభుత్వంలో నడ్డాకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ బాధ్యతలు ఇవ్వడంతో నెక్ట్స్ అధ్యక్షుడి నియామకం అనివార్యమైంది.
Read Also: Supreme Court: కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆఫీసులకు సుప్రీం నోటీసులు
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ కాంప్లెక్స్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌లతో బుధవారం భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో.. సంతోష్, నడ్డా బయటకి వెళ్లాక మోడీ, అమిత్ షాతో ఇరువురు వేర్వేరుగా కలిశారు. తదుపరి బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు అనేదే వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అధ్యక్ష రేసులో ఉన్నది ఎవరనే విషయాన్ని భారతీయ జనతా పార్టీ అధికారికంగా ఇంకా వెల్లడించలేదు.. ఇదే టైంలో గురు, శుక్ర వారాల్లో అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో బీజేపీ మీటింగ్ నిర్వహిస్తుంది. ఇందులో 2024 లోక్‌సభ ఎన్నికలలో పార్టీ పని తీరుపై నేతలు సమీక్ష చేయనున్నారు.