BJP: ఖలిస్తానీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ మద్దతు.. ఇందిరా గాంధీ హత్యని మరిచిపోయారా..?
- ఖలిస్తానీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ మద్దతు..
- లోక్‌సభలో ఎంపీ చరణ్‌జిత్ సింగ్ అనుకూల వ్యాఖ్యలు..
- ఇందిరా గాంధీ హత్యను గుర్తు చేసిన బీజేపీ..
- ఖలిస్తానీవాదులకు మద్దతు ఇవ్వడమేంటని కాంగ్రెస్‌పై ఆగ్రహం..
- ఈ వ్యాఖ్యలకు దూరంగా కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amritpal Singh: లోక్‌సభ వేదికగా ఖలిస్తానీ మద్దతుదారు, ఎంపీ అమృత్‌పాల్ సింగ్‌కి కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మద్దతు ఇవ్వడం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఖలిస్తాన్‌కి మద్దతు ఇస్తూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అమృత్‌పాల్‌ని జాతీయ భద్రతా చట్టాల కింద అరెస్ట్ చేశారు. అయితే, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి అమృత్‌పాల్ సింగ్ ఎంపీగా గెలిచారు. అయితే, అతడిని కటకటాల వెనక ఉంచడం ‘‘అప్రకటిత ఎమర్జెన్సీ’’ అని చన్నీ లోక్‌సభలో వ్యాఖ్యానించాడు. అయితే, ఈ వ్యాఖ్యల్ని లోక్‌సభ రికార్డుల నుంచి తొలగించినప్పటికీ వివాదం ముగియలేదు.
Read Also: BJP MP Nishikant Dubey: ఆ ప్రాంతాలను యూటీగా చేయడం లేకుంటే హిందువులు కనుమరుగైపోతారు..
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యకు గురైనప్పటికీ, కాంగ్రెస్ ఖలిస్తానీ సానుభూతిపరులకు మద్దతు ఇవ్వడం ప్రారంభించిందా..? అని బీజేపీ ప్రశ్నించింది. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సోషల్ మీడియాలో కాంగ్రెస్ తీరును తూర్పారపట్టారు. ‘‘ కాంగ్రెస్ ఎంపీ, పంజాబ్ మాజీ సీఎం చన్నీ ఖలిస్తాన్ అనుకూల వేర్పాటువాది అమృతపాల్ సింగ్‌కి మద్దతు ఇచ్చారు. ఇది జై సంవిధానమా..? భారత్ ముక్కలు ముక్కలు కావాలని కోరుకునే వేర్పాటువాదుల కోసం మద్దతు ఇస్తున్నారా..? రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. మాజీ ప్రధాని ఇందిరా జీ హత్యకు కారణమైన ఖలిస్తాన్ ఆలోచన, ఉగ్రవాదుల కోసం ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుంది. 26/11 జిహాదీలు, ఇప్పుడు ఖలిస్తానీ టెర్రరిస్టులకు కాంగ్రెస్ సపోర్టు ఎందుకు..?’’ అని ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు.
చన్నీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ దూరంగా ఉన్నప్పటికీ, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అమృత్‌పాల్ సింగ్‌పై చన్నీ అభిప్రాయం అతడి వ్యక్తిగతమని, ఇది కాంగ్రెస్‌కి సంబంధం లేదని పార్టీ మీడియా ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీ చన్నీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. చన్నీని కాంగ్రెస్ బహిష్కరించాలని బీజేపీ ఎంపీ దినేష్ శర్మ డిమాండ్ చేశారు. చన్నీ కెనడా నుంచి దేశవ్యతిరేక శక్తులు ఇచ్చే ఆదేశానుసారం పనిచేస్తున్నారని ఆరోపించారు. అతడిపై చర్యలు తీసుకోకుంటే, వారితో కాంగ్రెస్ కుమక్మైందని అర్థమని అన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఈ వ్యాఖ్యలకు దూరంగా ఉన్నారు.
Congress MP and Former Punjab CM Channi bats for radical pro-Khalistan separatist Amritpal Singh.
Is this Jai Sanvidhan? Batting for separatist who wants tukde tukde of India ?
Rahul ji must answer – the idea of Khalistan that caused the assassination of PM Indira ji is being… pic.twitter.com/j1MDq8s8QY
— Shehzad Jai Hind (Modi Ka Parivar) (@Shehzad_Ind) July 25, 2024
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
-
Shai Hope: అదే మా కొంప ముంచింది.. చాలా బాధగా ఉంది.. వెస్టిండీస్ కెప్టెన్ ఆవేదన..
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!