Wayanad tragedy: కేరళ వయనాడ్ కొండచరియలు విరిగిపడిన ఘటన యావద్ దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని దిగ్భాంతికి గురిచేసింది. జూలై 30న, ముండకై, చురలమల మరియు మెప్పాడితో సహా వాయనాడ్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడటంతో సమీపంలోని నది ఉప్పొంగి పలు గ్రామాలపై విరుచుకుపడింది. ఈ ఘటనలో చాలా ఇళ్లు బురద కింద కూరుకుపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 358 మంది మరణించారు. పలువురు ఆచూకీ ఇంకా లభించలేదు. ఆర్మీతో పాటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్యూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
Read Also: Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక లక్ష ఇండ్లు మాత్రమే కట్టింది ..
ఇదిలా ఉంటే, ఈ ఘటనను ఉద్దేశించి బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. కేరళలో ‘గోహత్య’ గురించి ఆయన కామెంట్స్ చేశారు. గోహత్య ఎక్కడ జరిగినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయని రాజస్థాన్ మాజీ ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజా పేర్కొన్నారు. కేరళలో వయనాడ్ ఘటన దీని పర్యవసానమే అని, ఈ పద్ధతుల్ని ఆపకుంటే ఇలాంటి విషాదాలు కొనసాగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఉత్తరా ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడినప్పటికీ, వయనాడ్ పరిమాణంలో విపత్తలుకు దారి తీయదని చెప్పారు. “2018 నుండి, గోహత్యలో పాల్గొన్న ప్రాంతాలు అటువంటి విషాద సంఘటనలను ఎదుర్కొనే నమూనాను మేము గమనించాము” అని అహుజా అన్నారు. గోహత్యల్ని ఆపకుంటే కేరళలో ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూనే ఉంటాయని హెచ్చరించారు.