Ayodhya gangrape: గ్యాంగ్ రేప్ నిందితుకు డీఎన్ఏ టెస్ట్ డిమాండ్.. ఎస్పీ చీఫ్ అఖిలేష్ వ్యాఖ్యలపై దుమారం..
- అయోధ్య గ్యాంగ్‌రేప్‌పై అఖిలేష్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
- డీఎన్ఏ టెస్ట్ చేయాలనే వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం..
- నిందితుల్లో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya gangrape: అయోధ్య గ్యాంగ్‌రేప్ ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో 12 ఏళ్ల చిన్నారిపై రెండు నెలల పాలు అత్యాచారం జరిగినట్లు తెలిసింది. లైంగిక వేధింపుల కారణంగా మైనర్ గర్భవతి కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అత్యాచారానికి పాల్పడిన నిందితుడు సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కార్యకర్త మోయిద్ ఖాన్‌తో పాటు రాజు ఖాన్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో నిందితులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘‘అకృత్యాల విషయంలో, కేవలం ఆరోపణలు చేయడం మరియు రాజకీయాలు చేయడం ద్వారా కాకుండా, నిందితులకు DNA పరీక్షలు చేయడం ద్వారా న్యాయానికి మార్గం కనుగొనాలి’’ అని అన్నారు. దోషులు ఎవరైనప్పటికీ చట్టప్రకారం శిక్షించాలి. అయితే డీఎన్ఏ పరీక్షలో ఆరోపణలు నిజం కాదని తెలిస్తే, సంబంధిత ప్రభుత్వ అధికారులను కూడా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Read Also: Joe Biden: నన్ను మోసం చేయడం ఆపండి.. ఇజ్రాయెల్ ప్రధానిపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..
Also Read
డీఎన్ఏ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అఖిలేష్ యాదవ్ నిందితులని సమర్థిస్తున్నాడని, ఇది రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌ల మనస్తత్వమని విమర్శించింది. ఈ ఘటనపై ప్రతిపక్ష ఇండియా కూటమి మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించింది. ‘‘మొయీద్‌ఖాన్ ముస్లిం కావడం, బాధితురాలు నిషాద్ సామాజికవర్గానికి చెందిన మైనర్ బాలిక కావడం వల్లే రేపిస్టులను రక్షించాలని ఇంత ఆరాటమా? ఓట్ల కోసమే పీడీఏ గురించి మాట్లాడుతున్నారా? ఇదీ ముస్లిం బుజ్జగింపుల ఎత్తు. వెనుకబడిన వర్గాలను ఎస్పీ ఎప్పుడూ దోపిడీ చేస్తోంది. కానీ ఈసారి అన్యాయం జరగబోదు’’ అని బీజేపీ ఐటీ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
యూపీ డిప్యూటీ సీఎం కేశమ్ ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ బంటు అని విమర్శించారు. మీరు వెనకడినవారు, దళితుల గురించి మరిచిపోయారు, మీకు ఓటు బ్యాంక్ రాజకీయాలే కావాలని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ చీఫ్ మాయావతి మాట్లాడుతూ.. మీరు ఎంత మంది నిందితులకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించాని అఖిలేష్‌ని ప్రశ్నించారు.అయోధ్య సామూహిక అత్యాచార కేసులో బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల్ని ఆమె సమర్థించారు. అఖిలేష్ ప్రకటనపై బాలల హక్కుల పరిరక్షణ కమిష్ చైర్‌పర్సన్ ప్రియాంక్ కనూంగో ఫైర్ అయ్యారు. బాలికపై అత్యాచారం జరిగితే నిందితుల్ని సమర్థిస్తున్నారని ఇదే మీ డీఎన్ఏ అంటూ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!