Kangana Ranaut: బంగ్లాదేశ్‌లో జరిగిన తిరుగుబాటు ఘటనపై మండి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ స్పందించారు. షేక్ హసీనా భారత్‌లో సురక్షితంగా ఉండడం గౌరవప్రదమైన విషయమని అన్నారు. ముస్లిం దేశాల్లో ఎవరూ సురక్షితంగా లేరని ఈ సందర్భంగా పేర్కొనింది. హింసాత్మక నిరసనల కారణంగా.. షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత బంగ్లాదేశ్‌ను విడిచి పెట్టవలసి వచ్చిందని పేర్కొన్నారు.
Read Also: Israel-Hamas war: ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా ఇరాన్ దాడి చేసే ఛాన్స్: అమెరికా
అలాగే, హిందూ రాష్ట్రం అంటూ ప్రశ్నించే వారిపై ఎంపీ కంగనా రనౌత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ.. భారతదేశంలో నివసించే వారు హిందూ రాష్ట్రం ఎందుకు.. రామరాజ్యం కావాలని అడుగుతుంటారని ఆమె పేర్కొన్నారు. అయితే, ముస్లిం దేశాలైన ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల్లోని ముస్లింలే సురక్షితంగా లేరని ఎద్దేవా చేశారు. మనం రామరాజ్యంలో జీవించడం మన అదృష్టం అంటూ ఎంపీ కంగనా రనౌత్ పేర్కొన్నారు. కాగా, బంగ్లాదేశ్‌లో ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్ర రూపం దాల్చింది. దీంతో వేలాది మంది నిరసనకారులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసింది.