Waqf Board Amendment Bill: వక్ఫ్ బోర్డులో హిందువులకు కూడా చోటు!..తీవ్రంగా మండిపడ్డ ముస్లిం ఎంపీ
- లోక్‌సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు
- వక్ఫ్ బోర్డులో మహిళలు కూడా చేరవచ్చని బిల్లలో ప్రతిపాదన
- ముస్లిమేతరులు కూడా ఇందులో భాగం కాగలరని బిల్లులో స్పష్టం
- బిల్లులో పలు ప్రతిపాదనలపై విపక్షాల అభ్యంతరాలు
- తీవ్రంగా విమర్శించిన రాంపూర్ లోక్‌సభ ఎస్పీ ఎంపీ మొహిబుల్లా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో పలు ప్రతిపాదనలపై విపక్షాల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వక్ఫ్ బోర్డులో మహిళలు కూడా చేరవచ్చన్నది ఈ ప్రతిపాదనల్లో ఒకటి. ఇది కాకుండా.. ముస్లిమేతరులు కూడా ఇందులో భాగం కాగలరని బిల్లులో ఉంది. దీనిపై లోక్‌సభలో వాడివేడి చర్చ సాగుతోంది.
READ MORE: Himachal Pradesh : హిమాచల్ లో క్లౌడ్ బరస్ట్.. వరదల కారణంగా 13మంది మృతి, 109రోడ్లు బంద్
Also Read
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
- OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
- AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
కాగా..వక్ఫ్ బిల్లుకు కేంద్ర మంత్రి లాలన్ సింగ్ మద్దతు తెలిపారు. ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని లాలన్ సింగ్ తెలిపారు. “ఏదైనా సంస్థ నిరంకుశంగా మారినప్పుడు.. దానిని నియంత్రించడానికి, పారదర్శకత కోసం ప్రభుత్వం చట్టాలను చేస్తుంది. వక్ఫ్ బోర్డులో పారదర్శకత ఉండాలి. పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకువచ్చాం.” అని స్పష్టం చేశారు.
READ MORE: Ganja Gang Arrest: తీగ లాగితే కదిలిన డొంక.. గంజాయి విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
యూపీలోని రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ ఎంపీ మొహిబుల్లా మాట్లాడుతూ.. ఈ బిల్లు ముస్లింలను లక్ష్యంగా చేసుకోబోతోందని అన్నారు. వక్ఫ్ ఆస్తుల బోర్డులో హిందూ సోదరులను చేర్చాల్సిన అవసరం ఏముందన్నారు. హిందువులు, ముస్లింలు లేదా ఏ మతానికి చెందిన వారైనా తమ సంస్థలను నిర్వహించుకునే హక్కు ఉందన్నారు. ఈ బిల్లు తీసుకురావడం ద్వారా మనమే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నామని మండిపడ్డారు. వక్ఫ్‌లో ముస్లిమేతరులను చేర్చే ప్రశ్న తలెత్తితే, అత్యంత పురాతన వక్ఫ్ ఆస్తి కాబా అని మొహిబుల్లా చెప్పారు. ఇదే లాజిక్ అయితే సౌదీ అరేబియాలోని కాబా కమిటీలో హిందువులను కూడా చేర్చుకుంటారా? ఈ బిల్లును నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ప్రజలు తమ హక్కులను కాపాడుకునేందుకు మళ్లీ వీధుల్లోకి రాకూడదని నేను భావిస్తున్నా అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!